అభ్యర్థులు

17:58 - September 21, 2018

విజయవాడ  :  జనసేన పార్టీ పుట్టి కొంతకాలం అీయినా..ప్రత్యక్షంగా 2019 ఎన్నికలో్ల బరిలోకి దిగబోతోంది.  ఈ నేపథ్యంలో పార్టీ తరపు నుండి బరిలోకి దిగే అభ్యర్థులపై జనసేన కసరత్తు చేస్తోంది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కప్పలు గెంతినట్లుగా నేతలు ఆ పార్టీలో నుండి ఈ పార్టీలోకి గెంతటం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తర పార్టీల్లో సీట్లు వచ్చే అవకాశం లేని నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు జనసేన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లు దొరకని నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. 
ఇప్పటికే రాజకీయ కుటుంబాల వారసులు తమతో టచ్‌లో ఉన్నారని సదరు నేత తెలిపారు. విజయవాడలో కీలకంగా వున్న సెంట్రల్‌ నుంచి సీపీఎం తరఫున గతంలో పోటీ చేసిన బాబూరావు బరిలోకి దిగే అవకాశం ఉంది. పశ్చిమ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోటీ చేయవచ్చునని చెబుతున్నారు.
 ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ రెండవ కుమార్తె విజయవాడ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు సన్నిహితుడు తోట చంద్రశేఖర్‌ భార్య అనురాధ అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారు కావడంతో అవనిగడ్డ అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు నుంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీ వర్గా లు తెలిపాయి. మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణ మనమడు రామచరణ్‌ పేరు కూడా ఈ స్థానాలకు వినిపిస్తోంది. జగ్గయ్య పేట సీటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మేనల్లుడు అడుగుతున్నారు. ప్రస్తుతం ఆయన సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉన్నారు.

 

09:37 - September 16, 2018

హైదరాబాద్ : ఇది వీఆర్వో కొలువుల పరిస్థతి...భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ అర్హతతో కూడిన ఈ పోస్టులకు ఉన్నత విద్య అభ్యసించిన వారు సైతం కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. అంటే ఒక్క పోస్టుకు 1512 మంది పోటీ పడుతున్నారన్నమాట. ఈనెల 16న రాత  రాత పరీక్ష జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 2945 పరీక్షా కేంద్రాలను టీఎ్‌సపీఎస్సీ ఏర్పాటు చేసింది. వీఆర్వో రాత పరీక్ష ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు బదులు 11 గంటలకు ప్రారంభం కానుందని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్నందున అరగంట ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రంలోకి రావాలని, హాల్‌టికెట్‌తో పాటు ఫొటో ఐడీ కార్డు తీసుకొని రావాలని అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా ఈసారి బయోమెట్రిక్‌ యంత్రాలను వాడటం లేదని పేర్కొంది.

 

17:56 - September 12, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు ఈనెల 20వ తేదీలోపు ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. 30 నుంచి 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో జీహెచ్ ఎంసీలో 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈనెల 15న హైదరాబాద్ కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. అదే రోజున మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే అమిత్ షా వచ్చాక అయినా లేదా రాకముందైన 20 వ తేదీ లోపు అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్నారు. అభ్యర్థుపై ఖరారుపై కమిటీ వేశారు. ఆ రిపోర్టును బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు పంపనున్నారు. అనంతరం ఎన్నికల ఫైనల్ లిస్టును ప్రకటించనున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సీటు ఖరారు చేశారు. ముషీరాబాద్ నుంచి బి.లక్ష్మణ్, అంబర్ పేట్ నుంచి జి.కిషన్ రెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్, గోషామహల్ నుంచి రాజాసింగ్, ఖైరతాబాద్ నుంచి చింతల రాంచంద్రారెడ్డిల పేర్లు ఖరారు అయ్యాయి. వీరు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.  వీరితోపాటు మల్కాజ్ గిరి నుంచి రామచంద్రారావు(బీజేపీ జీహెచ్ ఎంసీ అధ్యక్షుడు), సికింద్రాబాద్ నుంచి సతీష్ గౌడ్, కూకట్ పల్లి నుంచి మాతవరం కాంతారావు, మహబూబ్ నగర్ నుంచి పద్మజారెడ్డి, మునుగోడు నుంచి జి.మనోహర్ రెడ్డి, సూర్యపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మహేశ్వరం నుంచి సందీప్ శర్మ, పరిగి నుంచి ప్రహ్లాద్ పేర్లు ఫైనల్ అయ్యాయి. అభ్యర్థులు లేని చోట ఆశావహులు ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకు వస్తే వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. 

20:49 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 105మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ భవన్ లో జరిగిన ఈ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈసందర్భంగా నేతలకు ఆయన దిశా..దశ నిర్ధేశం చేశారు. శుక్రవాం నుండే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. టికెట్ వచ్చిందని గర్వపడొద్దని, నియోజకవర్గంలోని అందరి నేతలతో కలుపుకొని పోవాలని, ప్రతి నియోజకవర్గానికి తాను రావడం జరుగుతుందని...ఒక్కటి..రెండు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో తాను ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన ఫీడ్ బ్యాంక్ తీసుకోవడం జరుగుతుందని..అలసత్వం ప్రదర్శిస్తే తనకు సమాచారం అందుతుందని...15 రోజుల తరువాత జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఇక అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించాలని సూచించారు. 

16:19 - September 6, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ 105 స్థానాలకు టికెట్లు కేటాయించగా.. ఐదు స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ ఐదు నియోజకవర్గాలు.. మేడ్చల్, మల్కాజ్‌గిరి, వరంగల్ ఈస్ట్, చొప్పదండి, వికారాబాద్ నియోజవకర్గాలకు ఆయా లోకల్ లీడర్లతో మాట్లాడిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ ఐదు నియోజకవర్గాలకు మినహాయించి.. మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తున్నాం. అనేక సర్వేల తర్వాత టికెట్లు ఇచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు.

15:49 - September 6, 2018

హైదారబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు మామూలుగా లేదు. ఊహించని విధంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ మరో ఊహించని అడుగు వేశారు. ప్రతిపక్షాలు సైతం విస్మయం చెందేలా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 105 మంది ఎమ్యెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఆందోల్, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ స్థానాలను పెండింగ్ లో ఉంచామని చెప్పారు. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి సీట్లను వారికే కేటాయించడం జరిగిందని చెప్పారు. సిట్టింగ్ లను మార్చబోమని గతంలోనే చెప్పానని... చెప్పినట్టుగానే అందరికీ సీట్లను ఇస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల చిన్నచిన్న సమస్యల కారణంగా కొందరికి తొలి జాబితాలో సీట్లను కేటాయించలేకపోయామని చెప్పారు. 15 సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు.

కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థులు వీరే..

భద్రాద్రి కొత్తగూడెం : 
1. భద్రాచలం-టి.వెంకట్రావు 
2. పినపాక-పాయం వెంకటేశ్వర్లు 
3. అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు 
4. ఇల్లెందు: కోరం కనకయ్య 
5. కొత్తగూడెం-జలగం వెంకట్రావు
ఖమ్మం 
6. ఖమ్మం-పువ్వాడ అజయ్‌కుమార్‌ 
7. పాలేరు-తుమ్మల నాగేశ్వరరావు 
8. వైరా-బానోత్‌ మదన్‌లాల్‌ 
9. మధిర: లింగాల కమల్‌రాజ్‌ 
10. సత్తుపల్లి: పిడమర్తి రవి
మహబూబాబాద్‌ 
11. మహబూబాబాద్‌: బానోత్‌ శంకర్‌ నాయక్‌ 
12. డోర్నకల్‌: డీఎస్‌ రెడ్యానాయక్‌
వరంగల్‌(రూరల్‌) 
13. పరకాల: చల్లా ధర్మారెడ్డి 
14. నరసంపేట: పెద్ది సుదర్శన్‌ 
15. వర్థన్నపేట: ఆరూరి రమేష్‌
వరంగల్‌(అర్బన్‌) 
16. వరంగల్‌ వెస్ట్‌: దాస్యం వినయ్‌ భాస్కర్
జయశంకర్‌ భూపాలపల్లి 
17. భూపాలపల్లి: ఎస్‌. మధుసూదన్‌ 
18. ములుగు: అజ్మీర చందూలాల్‌
జనగామ 
19. జనగామ: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 
20. స్టేషన్‌ఘన్‌పూర్‌: డాక్టర్‌ తాడికొండ రాజయ్య 
21. పాలకుర్తి: ఎర్రబెల్లిదయాకరరావు
నల్గొండ 
22. నల్గొండ: కంచర్ల భూపాల్‌రెడ్డి 
23. మిర్యాలగూడ: ఎన్‌.భాస్కర్‌ రావు 
24. నాగార్జునా సాగర్‌: నోముల నరసింహయ్య 
25. దేవరకొండ: రమావత్‌ రవీంద్రకుమార్‌ 
26. మునుగోడు: కె.ప్రభాకర్‌రెడ్డి 
27. నకిరేకల్‌: వేముల వీరేశం
సూర్యాపేట 
28. సూర్యాపేట: జి.జగదీశ్‌రెడ్డి 
29. తుంగతుర్తి: గ్యెడారి కిషోర్‌కుమార్‌
యాదాద్రి భువనగిరి 
30. ఆలేరు: గొంగిడి సునీత 
31. భువనగిరి: పి.శేఖర్‌రెడ్డి
నిజామాబాద్‌ 
32. నిజామాబాద్‌ అర్బన్‌: గణేష్‌ బిగ్గాల 
33. నిజామాబాద్‌ రూరల్‌: బాజిరెడ్డి గోవర్థన్‌ 
34. ఆర్మూర్‌: ఆసన్నగారి జీవన్‌రెడ్డి 
35. బాల్కొండ: వేముల ప్రశాంత్‌రెడ్డి 
36. బోధన్‌: షకీల్‌ అహ్మద్‌
కామారెడ్డి 
37. బాన్సువాడ: పోచారం శ్రీనివాసరెడ్డి 
38. కామారెడ్డి: గంప గోవర్థన్‌ 
39. జుక్కల్‌: హన్మంతు షిండే 
40. ఎల్లారెడ్డి: ఏనుగు రవీందర్‌రెడ్డి
ఆదిలాబాద్‌ 
41. ఆదిలాబాద్‌: జోగురామన్న 
42. బోధ్‌: రాథోడ్‌ బాబూరావు 
43. ఖానాపూర్‌: రేఖా నాయక్‌
అసిఫాబాద్‌ 
44. అసిఫాబాద్‌: కోవ లక్ష్మి 
45. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌: కోనేరు కోనప్ప
నిర్మల్‌ 
46. నిర్మల్‌: అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి 
47. ముథోల్‌: జి.విఠల్‌రెడ్డి
మంచిర్యాల 
48. మంచిర్యాల: నడిపెల్లి ద్వారకారావు 
49. బెల్లంపల్లి: దుర్గం చిన్నయ్య 
50. చెన్నూరు: బాల్క సుమన్‌
కరీంనగర్‌ 
51. కరీంనగర్‌: గుంగుల కమలాకర్‌ 
52. హుజురాబాద్‌: ఈటల రాజేందర్‌ 
53. మానకొండూరు: రసమయి బాలకిషన్‌
సిరిసిల్ల 
54. సిరిసిల్ల: కేటీఆర్‌ 
55. వేములవాడ: చెన్నమనేని రమేష్‌
జగిత్యాల 
56. జగిత్యాల: డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 
57. కోరుట్ల: కె. విద్యాసాగర్‌రావు 
58. ధర్మపురి: కొప్పుల ఈశ్వర్‌ 
59. పెద్దపల్లి: దాసరి మనోహర్‌రెడ్డి 
60. మంథని: పుట్టా మధుకర్‌ 
61. రామగుండం: సొమారపు సత్యనారాయణ
సిద్దిపేట 
62. సిద్దిపేట: తన్నీరు హరీశ్‌రావు 
63. దుబ్బాక: సోలిపేట రామలింగారెడ్డి 
64. గజ్వేల్‌: కె.చంద్రశేఖరరావు 
65. హుస్నాబాద్‌: వడితెల సతీష్‌కుమార్‌
మెదక్‌ 
66. మెదక్‌: పద్మా దేవేందర్‌రెడ్డి 
67. నర్సాపూర్‌: చిలుముల మదన్‌రెడ్డి
సంగారెడ్డి 
68. సంగారెడ్డి: చింతా ప్రభాకర్‌ 
69. నారాయణఖేడ్‌: ఎం.భూపాల్‌రెడ్డి 
70. అంధోల్‌: చంటి క్రాంతి కిరణ్‌ 
71. పటాన్‌చెరు: గూడెం మహిపాల్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌ 
72. మహబూబ్‌నగర్‌: వి. శ్రీనివాస్‌గౌడ్‌ 
73. జడ్చర్ల: సీహెచ్‌ లక్ష్మారెడ్డి 
74. దేవరకద్ర: ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి 
75. నారాయణపేట్‌: ఎస్‌.రాజేందర్‌రెడ్డి 
76. మక్తల్‌: సి.రామమోహన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌ 
77. నాగర్‌కర్నూల్‌: మర్రి జనార్దన్‌రెడ్డి 
78. కొల్లాపూర్‌: జూపల్లి కృష్ణారావు 
79. అచ్చంపేట: గువ్వల బాలరాజ్‌ 
80. కల్వకుర్తి: జి.జైపాల్‌యాదవ్‌
వనపర్తి 
81. వనపర్తి: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
గద్వాల్‌ 
82. గద్వాల్‌: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 
83. ఆలంపూర్‌: వి.ఎం.అబ్రహాం
వికారాబాద్‌ 
84. పరిగి: కొప్పుల మహేష్‌రెడ్డి 
85. తాండూరు: పట్నం మహేందర్‌రెడ్డి 
86. కొడంగల్‌: పట్నం నరేందర్‌రెడ్డి
రంగారెడ్డి 
87. షాద్‌నగర్‌: వై.అంజయ్య యాదవ్‌ 
88. రాజేంద్రనగర్‌: టి. ప్రకాష్‌గౌడ్‌ 
89. మహేశ్వరం: తీగల కృష్ణారెడ్డి 
90. ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 
91. శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ 
92. ఎల్బీనగర్‌: ఎం.రామ్‌మోహన్‌గౌడ్‌ 
93. చివ్వెంల: కాలే యాదయ్య
మల్కాజ్‌గిరి-మేడ్చల్‌ 
94. కుత్బుల్లాపూర్ : కేపీ వివేకానంద‌ 
95. కుక‌ట్‌ప‌ల్లి : మాద‌వ‌రం కృష్ణారావు 
96. ఉప్ప‌ల్ : బేతి సుభాష్ రెడ్డి
హైదరాబాద్‌ 
97. సికింద్రాబాద్ : టి. ప‌ద్మారావు గౌడ్‌ 
98. సనత్‌నగర్‌‌: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ 
99. కంటోన్మెంట్ : జి.సాయ‌న్న‌ 
100. జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాథ్‌ 
101. యాకుత్ పురా: సామ సుంద‌ర్ రెడ్డి 
102. చంద్రాయ‌ణ‌గుట్ట‌: సీతారామ్‌రెడ్డి 
103. కార్వాన్ : జీవన్ సింగ్‌ 
104. బ‌హదుర్‌పుర : ఇనాయ‌త్ అలీ బ‌క్రీ 
105. నాంప‌ల్లి : మునుకుంట్ల ఆనంద్ గౌడ్‌

15:17 - September 6, 2018

హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము మేనిఫెస్టోలో చెప్పని అంశాలు ఎన్నో అమలు చేశామని తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. గురువారం ఆయన ప్రెస్ మీట్ తో మాట్లాడారు. రైతు బందు, రైతు బీమా, భూ రికార్డుల ప్రక్షాళన, బీసీ కులాలకు సంబంధించినవి..ఇలాంటివి 76 అంశాలను తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని తెలిపారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు.

అందులో భాగంగా ఎన్నికల అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించారు. అనేక సర్వేలు చేసిన అనంతరం 105 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వలేదన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్., వరంగల్ ఈస్ట్ జిల్లాల పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. 

15:17 - September 6, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దు అనంతరం ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్న కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు సమరశంఖం పూరించారు. ఈ నేపథ్యంలో 105 మంది అభ్యర్థులకు కేసీఆర్ ప్రటించారు. కొంతమంది అభ్యర్థులకు షాక్ ఇచ్చారు. బాబూ మోహన్ టికెర్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. పెండింగ్ లో మరికొంతమంది అభ్యర్థులను పెట్టారు. చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. 

15:08 - September 6, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు ఇంకా సమయం ఉంది...ఈసీ కూడా అప్పుడే ఎన్నికలు కూడా ప్రకటించలేదు. కానీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ప్రకటించేసింది. అనేక సర్వేలు చేసిన అనంతరం 105 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వలేదన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్., వరంగల్ ఈస్ట్ జిల్లాల పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. 

17:50 - July 27, 2018

ఢిల్లీ : అధికార పనుల కోసం వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ భవన్‌లో వసతి కల్పిచేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ఏపీ భవన్‌ డాట్‌ ఇన్‌ పేరుతో ఈ వెబ్‌ సైట్‌ను అందుబాబులోకి తెచ్చారు. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అలాగే యూపీఎస్‌సీ నిర్వహించే పోటీ పరీక్షల ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా వసతి కల్పించాలని నిర్ణయించారు. ఏపీ భవన్‌లో రూములు అందుబాటులో లేకపోతే పక్కనే ఉన్న మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ భవన్‌లో వసతి కల్పించేందుకు ఏపీ భవన్‌ అధికారులు చర్యలు తీసుకుంటారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - అభ్యర్థులు