అక్షరం

06:43 - December 6, 2017

విశాఖపట్టణం : వైజాక్ ఫెస్ట్ కార్యక్రమం విశాఖ వాసులను ఆకట్టుకుంటుంది. ఫెస్ట్‌ని తిలకించడానికి విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ కృష్ణబాబు కూడా విచ్చేశారు. ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన బుక్‌ స్టాల్స్‌లో కలియతిరిగారు. ఫెస్ట్‌లో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజాకవి వంగపండు హాజరయ్యారు. ఫెస్ట్‌కి విచ్చేసిన సందర్శకులను తన పాటలతో ఉర్రూతలూగించారు. ఇలాంటి ఫెస్ట్ లను విశాఖ నగరంలో ఏర్పాటు చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని కృష్ణబాబు అన్నారు. పుస్తక పఠనం చాలా మంచిదని అందరూ పుస్తక పఠనం అలవరుచుకోవాలని.. బుక్‌ ఫెస్ట్‌లను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన కొనియాడారు.

చదవటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య. చదవడానికి, నేర్చుకోవడానికి వయస్సుతో సంబందం లేదని అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటి ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవ ప్రదర్శనలో వీరయ్య పాల్గొన్నారు. అక్షరాయుధం పాత్ర లేకుండా ఆధునిక సమాజంలో పోరాటం లేదని... మార్పు కూడా రాదన్నారు. జాతీయోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటల వెనుక అక్షరం ఉందని...ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని వీరయ్య సూచించారు.

 

12:14 - November 11, 2017

నాగర్ కర్నూలు : అనాథ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్భా పాఠశాలలు సరస్వతీ నిలయాలుగా విరాజిల్లుతున్నాయి. పొట్టకూటి కోసం పనిచేసిన పసి చేతులు అక్కడ అక్షరాలు దిద్దుతున్నాయి. పేద పిల్లలను అక్కున చేర్చుకొని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ కస్తూర్భా పాఠశాలపై ప్రత్యేక కథనం. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల. 2008 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పాఠశాలలో సకల వసతులు ఉన్నాయి. అందమైన పాఠశాల భవనం, పచ్చని చెట్లతో పాఠశాల ప్రాంగణం ఆహ్లాదకర వాతావరణాన్ని తలపిస్తుంది. పాఠశాల గోడలపై దేశనాయకుల చిత్రాలు, విద్యార్థుల సృజనాత్మకత శక్తిని పెంచే చిత్ర పటాలు దర్శనమిస్తాయి. విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఇక్కడ ప్రస్తుతం 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు.

ఈ కస్తూర్భాలో ప్రస్తుతం 197 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం లంబాడి తండాల నుండి వచ్చిన అనాథ పిల్లలే ఉంటారు. విద్యార్థులకు ఎలాంటి లోటు కలగకుండా పాఠశాల సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. ఆహారంలో గుడ్లు, పండ్లతో పాటు ప్రతి నిత్యం నాణ్యమైన భోజనం అందిస్తారు. విద్యార్థుల రక్షణ కోసం సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.

ఇక్కడి పాఠశాల యాజమాన్యం తమని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. అనాథలుగా ఉన్న తమకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలుస్తామంటున్నారు విద్యార్థినిలు. చదువులో మాత్రమే కాదు ఆటపాటల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామంటున్నారు కస్తూర్భా యాజమాన్యం. ఇక్కడికి వచ్చే విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటామని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న అనాధపిల్లలకు ఆశ్రమంలా నిలుస్తున్నాయీ కస్తూర్భాలు. ప్రభుత్వం ఇలాంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థినులు ఉన్నత స్థానానికి చేరాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. 

13:01 - July 23, 2017

అతడు ఎప్పుడు ప్రజల గురించే ఆలోచిస్తాడు. ప్రజలను ఆలోచింపచేయడానికి రచనలు చేస్తాడు. అలా ప్రజచైతన్య గేయలు, నాటకలు, రూపకాలు ఎన్నో రాశాడు విశాఖకు చెందిన మౌళలి. ఆయన సమాజంలోని అనేక రూగ్మతలపై వేయ్యికి పైగా పాటలు రాశాడు. మద్యపాన నిషేధం, మహిళ సమస్యలు, ఎయిడ్స్, గిరిజన పోరాటలు ఇలా అనేక అంశాలపై పాటలు రాసి ప్రజలను చైతన్యవంతం చేస్నున్నా ప్రముఖ గేయకవి ఎన్ఐఎన్ మౌళలి జనం పాటలో పరిచయం చేస్తున్నారు. ప్రముఖ గేయ కవి స్ఫూర్తి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:00 - July 23, 2017

సృజకారులరా మీరు ఎటువైపు..ప్రజలవైప ప్రభువవుల వైప అని ప్రశ్నిస్తాడు గోరెటి..సమాజంలో ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కవులు, కలకారలుపై ఉంటుంది. సృజనత్మక రచనలు సమాజంలో కదలికను తీసుకొస్తాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగే ఉద్యమాలను, ఆ ఉద్యమాసంబంధిత సృజనాత్మక కళారంగలను ఏకం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటివల మహిళ ఉద్యమాల తీరుతెన్నులను పరిశీలిస్తూ సాగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక చర్చ కార్యక్రమం మఖ్యంశాలతో మీ ముందుకు వచ్చింది అక్షరం. మన దేశంలో మహిళఉద్యమాలు బలంగా నడుస్తూన్న రాష్ట్రలో తెలంగాణ, ఏపీ ముందు వరసలో ఉన్నాయి. ఏ ఉద్యమానికైన గమనం ఏ వైపు సాగుతుందో నిరంతర సమీక్ష చాలా అవసరం. అదే సమయంలో ఒకే గమ్యంతో సాగే వ్యక్తులను కలుపుకుంటూ ముందుకు సాగాల్సి అవసరం చాలా ఉంటుంది. క్షేత్రస్థాయి ఉద్యమాలకు ఆ ఉద్యమానికి సంబంధించిన సంస్కృతిక సమన్వయన్ని సరిచూసుకుంటూ ఉద్యమాలను మరింత బలోపేతం దిశగా సాగటం ముఖ్యం. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

13:29 - July 16, 2017

సాహిత్యం సమాజంలోని ప్రజలను చైతన్య పరుస్తుంది. దోపిడివర్గాల గుట్టును రట్టు చేస్తుంది. సామాజిక అసమానతలను బయట పెడుతుంది. అట్టడుగు వర్గాల ప్రజలను  ఉద్యమాల బాట పట్టిస్తుంది. అలాంటి రచనలు చేసిన రచయితలు మన మధ్య ఎందరో ఉన్నారు. వారిలో వర్థమానకవి అనంతోజు మోహన్ కృష్ణ. ఆయన పరిచయ కథనతో ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం. కొంత మంది యువకులు ముందు యుగం దూతలు అంటూ మహాకవి శ్రీశ్రీ యువతరాన్ని అభినందించారు. అలాంటి యువకులలో కవులుగా మారినవారెందరో యున్నారు. వారిలో అనంతోజు మోహన కృష్ణ ఒకరు. పాలకుల కళ్లకు పట్టిన పొరలు తొలగనంతవరకు మన చుట్టూ అంతా అంధకారమే అంటూ కవిత్వం రాసిన వర్థమానకవి అనంతోజు మోహన్ కృష్ణ. ఆయన ఇటీవల ఆలోచన చేద్దామా అన్న కవితా సంపుటిని వెలువరించారు. ప్రజలను చైతన్య పరిచే కవిత్వం రాస్తున్న అనంతోజు మోహన్ కృష్ణ పరిచయ కథనం ఈ వారం కొత్త కెరటంలో..మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:25 - July 16, 2017

సాహిత్యం సమాజంలోని ప్రజలను చైతన్య పరుస్తుంది. దోపిడివర్గాల గుట్టును రట్టు చేస్తుంది. సామాజిక అసమానతలను బయట పెడుతుంది. అట్టడుగు వర్గాల ప్రజలను  ఉద్యమాల బాట పట్టిస్తుంది. అలాంటి రచనలు చేసిన రచయితలు మన మధ్య ఎందరో ఉన్నారు. వారిలో అభ్యుదయ గేయ రచయిత నూనెల శ్రీనివాసరావ్. ఆయనపై కథనంతో ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం. తెలుగు నాట వచన కవిత్వం రాసే కవులతో పాటు గేయరచయితలెందరో ఉన్నారు. కవిత్వం మేధావులను ఆలోచింపజేస్తే.... గేయాలు సామాన్య ప్రజలను చైతన్యవంతం చేస్తాయి. అలాంటి గేయాలు రాసిన విశాఖ జిల్లా రచయిత నూనెల శ్రీనివాసరావు. ఆయన వందకు పైగా గేయాలు రాసారు. శ్రమైక గేయాలు అన్న పాటల పుస్తకం కూడా వెలువరించారు. గేయకవి నూనెల శ్రీనివాస్ రావు జనం పాట మీ కోసం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:42 - July 9, 2017

ప్రముఖ నవలారచయిత ప్రభాకర్ జైని రాసిన సినీవాలీ నవల ఆవిష్కరణ సభ ఇటీవల రవీంద్రభారతిలో జరిగింది. తెలంగాణా ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో  ఆధ్యాత్మిక గురువు శ్రీరాంసార్ సినీ వాలీ నవలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నవ్యవీక్లీ ఎడిటర్ జగన్నాథశర్మ, ఎ.పి.బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోషియేషన్  అధ్యక్షులు టి.రాజేందర్, బిక్కి కృష్ణ, అసుర, కత్తిమహేశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. ఇటీవల మహబూబాబాద్ లో కవయిత్రి కీర్తనారెడ్డి రాసిన జీవనవీణ కవితా సంపుటిని ప్రముఖ కవి, ప్రజాగాయుడు గోరటి వెంకన్న ఆవిష్కరించారు. బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వై.ఎస్.ఆర్ శర్మ, జాయింట్ కలెక్టర్  దామోదర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఉమా మురళీనాయక్, ఆకెళ్లరాఘవేంద్ర తదితరులుపాల్గొన్నారు. 

13:41 - July 9, 2017

తెలంగాణాలో ఎందరో గేయరచయితలున్నారు. అద్భుతమైన పాటలు రాస్తున్నారు. ప్రజలను తమ పాటలతో ఉత్తేజపరుస్తున్నారు. ఉద్యమాల బాట పట్టిస్తున్నారు. అలాంటి వారిలో కరీంనగర్ కు చెందిన కన్నం లక్ష్మీనారాయణ ఒకరు. ఆయన ఓ పక్క సింగరేణి బొగ్గుగనిలో కార్మికునిగా పనిచేస్తూ మరో పక్క గేయరచయితగా పాటలు రాస్తూ వచ్చారు. ప్రముఖ గేయరచయిత కన్నం లక్ష్మినారాయణ జనం పాట మీ కోసం..పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:39 - July 9, 2017

తెలుగు కథా శిఖరం నేలకొరిగింది.. తెలుగు కథా మాంత్రికుడు నిష్క్రమించాడు.. సంక్లిష్ట సందర్భంలో ఉన్న సమాజంలోని సంఘర్షణను ఒడిసిపట్టి తెలుగు పాఠకుల ముందు నిబద్ధతగా నిలబడిన ఓ నిలువెత్తు కథలాంటి మనిషి అదృశ్యమయ్యాడు.. ప్రముఖ కథారచయిత, నవలాకారుడు డా.వి.చంద్రశేఖరరావు కన్నుమూతతో తెలుగు సాహితీ ప్రపంచం విషాదంలో మునిగింది. ఆ మహాకథన శిల్పికి నివాళులర్పిస్తూ..ఈ వారం అక్షరం మీ ముందుకొచ్చింది. 
సంచలనం సృష్టించిన రచయిత డా.వి.చంద్రశేఖరరావు 
తెలుగు కథాసాహిత్యంలో, నవలా రచనలో సంచలనం సృష్టించిన గొప్ప రచయిత డా.వి.చంద్రశేఖరరావు శనివారం కన్నుమూసారు. ఆకుపచ్చని దేశం, నల్లమిరియం చెట్టు, ఐదుహంసలు,లాంటి నవలలు, జీవని, లెనిన్ ప్లేస్, మాయాలాంతరు, ద్రోహవృక్షం లాంటి కథాసంకలనాలు వెలువరించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు వర్తమాన జీవితం నుంచి వస్తువును తీసుకుని, తన రక్తంలో ముంచి అద్భుతమైన సృజన సాగించిన... మన కాలం మహాకథారచయిత వి. చంద్రశేఖర్రావు. 

12:52 - June 18, 2017

అధునిక తెలుగు సాహిత్యాన్ని తన కలం బలంతో సుసపన్నం చేసిన కవి దిగ్గజం సినారె...కవిత రాసిన, పాట రాసిన, గజల్ రాసిన తనదైనా ముద్రతో సంచలనం సృష్టించిన గొప్ప కవి ఆయన...తెలుగు భాషకు సాహిత్యానికి సుమారు ఆరు దశాబ్దల పాటు ఎనలేని సేవ చేసిన ఆ మహాకవి ఇటివల కన్నుమూయటం తెలుగు సాహిత్యానికి తీరని లోటు....తెలుగు సాహితి లోకలంలో మకుటం లేని కవిరాజుగా వెలిగిన కవితల నెలరాజు శాశ్వతంగా మబ్బుల చాటుకు వెళ్లిపోయారు... సినారె ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి సాహితి విశ్వభరునిగా ఎదిగినా మట్టి బిడ్డ....తన సాహిత్య ద్వారా మానవతా కేతనాన్ని ఎగరేసి జ్ఞాన పీఠం అధిరోహించిన కవిత చక్రవర్తి... సినారె అన్న మూడు అక్షరాలు తెలుగు సాహిత్యంపై చెరగాని ముద్ర వేశాయి....అధునిక తెలుగు కవిత్వానికి జవసత్వాలు అందించిన కవి దిగ్గజం సినారె.... ఆయన ఉరికే కవితల జలపాతం...పరవశాలు పంచే పాటల పారిజాతాల వనం.. విశ్వమానవ హృదయంతరాలలోని చైతన్య జలపాతల సవ్వడిని కవితలుగా వినిపించిన విశ్వంభర కవితా విరాట్ స్వరూపం..తెలుగు శబ్దాల రంగు, రుచి, వాసనల మత్తును సినిగేయల రూపంలో వెదజల్లిన వెండితెర కవిరాజు కవితల నెలరాజు సినారె....ఆ మహాకవి అక్షరం ఘన నివాళి పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - అక్షరం