సైరా మోషన్ టీజర్ :పాండియన్ గెటప్ లో విజయ్ సేతుపతి 

Submitted on 16 January 2019
Syra : Vijay Sethupathi Motion Teaser

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై హీరో రాంచరణ్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. "సైరా" చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి లుక్ ను చిత్ర యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది. విజయ్ సేతుపతి "సైరా" లో రాజా పాండి అనే పాత్ర పోషిస్తున్నారు. బుధవారం విజయ్ సేతుపతి పుట్టిన రోజు కూడా కావటంతో చిత్ర యూనిట్ విజయ్ సేతుపతి మోషన్ టీజర్ ను కూడా విడుదల చేసింది. వీరుడి గెటప్ లో ఉన్న విజయ్ సేతుపతి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.  
1800 సంవత్సరాల నాటి కాలంలో బ్రటీష్ వారిపై  తిరుగుబాటు చేసిన తొలి భారతీయ పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కధ ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో  నరసింహా రెడ్డి భార్య సిధ్ధమ్మ పాత్రలో నయనతార నటిస్తున్నారు.  బాలీవుడ్  మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు,  కిచ్చా సుదీప్,బ్రహ్మాజీ  తమన్నా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈసినిమాను ఆగస్టు 15కి విడుదల చేయాలని  చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. 

Vijay Sethupathi
Vijay Sethupathi birthday
Raaja Paandi
Sye Raa Narasimha Reddy
Makkal Selvan
Chiranjeevi
Sye raa
Ram Charan

మరిన్ని వార్తలు