కశ్మీర్ లో హైవేపై పేలిన బాంబు : తప్పిన పెను ప్రమాదం

Submitted on 27 May 2019
 Suspected IED material destroyed by bomb disposal squad at the Jammu-Poonch highway in Kallar

కశ్మీర్ లో నేషనల్ హైవేపై పెను ప్రమాదం తప్పింది. జమ్మూ - రాజౌరీ మరియు ఫూంచ్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సోమవారం (మే 27) ఉదయం ఓపెనింగ్ పార్టీ దళాలు హైవేపై వెళ్తున్నాయి.

ఈ క్రమంలో కల్లార్‌ చౌక్‌ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను బలగాలు దూరం నుంచే గుర్తించాయి. వాటిని సమీపించేలోగానే అక్కడ చిన్నపాటి పేలుడు సంభవించింది. 

ఒక బాటిల్‌ నిండా ద్రవ పదార్థాలు, పాలిథిన్ కవర్ లో కొన్ని పదార్థాలు పడి ఉండటాన్ని ఆర్మీ గుర్తించింది.  జాతీయ రహదారిని బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని హైఅలర్ట్‌ ప్రకటించాయి. వెంటనే బాంబు స్వాడ్ కు సమాచారం అందించారు. 

వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని IED బాంబులను నిర్వీర్యం చేశాయి. ఆర్మీ బలగాల అప్రమత్తతో పెనుప్రమాదం తప్పిందని రాజౌరి SSP యూగల్ మన్హాస్ తెలిపారు. ఈ ఘటనపై  విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు.  

Jammu-Poonch
Highway
IED material
bomb disposal
in Kallar

మరిన్ని వార్తలు