సీబీఐ వివాదం : నాగేశ్వర్ నియామకంపై వచ్చే వారం విచారణ

Submitted on 16 January 2019
Supreme Court To Hear Petition Against Nageswara Rao As CBI Interim Chief


సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నె నాగేశ్వర్ రావు నియామకాన్ని సవాల్ చేస్తూ ఎన్జీవో కామన్ కాజ్, సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, చీఫ్ జస్టిస్ లతో కూడిన హైపవర్ కమిటీ సీబీఐ రూల్స్ ప్రకారం పూర్తిస్థాయి డైరక్టర్ ను నియమించాల్సి ఉండగా,  ఆ నిబంధనను ఏ మాత్రం పాటించలేదని వారి తరపు న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఆరోపించారు. సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా నాగేశ్వర్ రావుని నియమిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డర్ ను కొట్టివేయాలని కోరారు. సీబీఐ డైరక్టర్ కి  సంబంధించిన అన్ని పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.

CBI
INTERIM CHIEF
NAGESWAR RAO
NGO
Supreme Court
NEXT WEEK

మరిన్ని వార్తలు