సూపర్‌‌స్టార్ సినిమా చూసిన సూపర్‌స్టార్

Submitted on 11 January 2019
Super Star Mahesh Babu Tweet about Rajinikanth Peta Movie-10TV

సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించగా, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మించిన సినిమా, పెట్టా.. ఈసినిమాని, తెలుగులో పేట పేరుతో సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. తెలుగులో పెద్ద సంఖ్యలో థియేటర్స్ లేకపోవడం, ఆశించిన స్థాయిలో టాక్ రాకపోవడంతో పేట పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడే చెప్పలేం. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా సూపర్‌స్టార్ మహేష్ బాబు పేటా సినిమా చూసి తన స్పందన తెలియచేసాడు.

పేట ఈజ్ ఏ ట్రిబ్యూట్ టు ఆల్ ది ఫ్యాన్స్ ఆఫ్ రజినీకాంత్ సార్, ఇన్ క్లూడింగ్ మి.. ఓన్లీ వన్ వర్డ్, తలైవా.. కార్తీక్ సుబ్బరాజ్, యువార్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టాలెంట్స్ వుయ్ హావ్, డీఓపీ తిరు ఔట్ స్టాండింగ్ యాజ్ ఆల్వేస్.. కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్.. అంటూ పేట సినిమా పట్ల తన అభిప్రాయం వ్యక్తం చేసాడు. 


 

 

Super Star Rajinikanth
Super star Mahesh Babu
Peta Movie

మరిన్ని వార్తలు