నెటిజన్లు ఫిదా : నాగిని డ్యాన్స్ తో అదరగొట్టిన సన్నీ లియోన్ 

Submitted on 13 April 2019
Sunny Leone doing naagin dance Hindhi song has Internet Tik Tok Video viral

టిక్ టాక్.. నెటిజన్లనే కాదు.. సెలబ్రేటీలను సైతం కట్టిపడేస్తోంది. డ్యాన్స్, సింగింగ్.. ఏదైనా సరే తమ స్కిల్స్ ను బయటపెట్టేందుకు టిక్ టాక్ యాప్ తెగ వాడేస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ లు చేయడం సినిమా డైలాగ్ లకు లిప్స్ మూమెంట్ ఇలా ఏదో ఒకటి చేస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ టిక్ టాక్ ఫీవర్ బాలీవుడ్ నటులను సైతం ఆకట్టకుంటోంది. మొన్న జాక్వెలీన్ ఫెర్నాండెస్, నిన్న నేహా కక్కార్.. ఇప్పుడు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ టిక్ టాక్ వీడియో యాప్ లో ప్రత్యక్షమైంది.
Read Also : Jobsపై స్పీచ్ : చేసేది కూలిపని.. ఇంగ్లీష్ ఇరగదీశాడు

నాగిని డ్యాన్స్ తో అభిమానులను ఫిదా చేసింది. పాపులర్ డ్యాన్సర్, స్పప్న చౌదరి హిట్ సాంగ్ కు సన్నీ హుషారైన స్టెప్పులెస్తూ కుర్రకారుల మతిపొగట్టేసింది. థెరీ అఖ్యా కా యో కాజల్ అనే సూపర్ హిట్ హిందీ సాంగ్.. తన స్నేహితురాలితో కలిసి సన్నీ నాగిని డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను అలరించింది. సన్నీ నాగిని డ్యాన్స్ చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
Read Also : నువ్వొద్దమ్మా : తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన నటి సంగీత

Sunny Leone
naagin dance
Sapna Choudhary
Tik Tok Video

మరిన్ని వార్తలు