వివేకానందరెడ్డి హత్యలో సుధాకర్ రెడ్డిపై అనుమానాలు

Submitted on 15 March 2019
Sudhakar Reddy suspected of murdering Vivekananda Reddy

కడప : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కలకలం రేపుతోంది. వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. వేలిముద్రల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మార్చి 14 సాయంత్రం వివేక ఇంటికి ఎవరు వచ్చారన్న దానిపై విచరాణ చేస్తున్నారు. సెల్ టవర్స్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. వివేకా కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలన చేస్తున్నారు. పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు. మరోవైపు పాత నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై వైఎస్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. వివేకానందరెడ్డిని సుధాకర్ రెడ్డి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. 
Read Also: వివేకా హత్య : ఆరోపణలు రుజువైతే నడిరోడ్డు పై కాల్చేయండి

బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెడ్ రూమ్‌లోనూ రక్తపు మరకలు ఉండడంతో అందరి అనుమానాలు బలపడ్డాయి. నుదుటిపై ఇంతబలమైన గాయాలు కనిపిస్తున్నా.. గుండెపోటు అని చెప్పడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. డాగ్ స్క్వాడ్ కూడా ఆయన ఇంటి చుట్టే తిరిగినట్లు పోలీసులు తెలిపారు. వివేకానందరెడ్డి తల వెనక భాగంలో భారీ కత్తిపోటు ఉన్నట్లు చెబుతున్నారు. నుదుటపైనా రెండు లోతైన గాయాలు ఉన్నాయి. తొడపైనా గాయం ఉంది. శరీరంపై మొత్తం ఏడు చోట్ల కత్తిగాట్లు ఉన్నాయి. డాక్టర్ల ప్రాథమిక నిర్థారణ ఆధారంగా పోలీసులు హత్యగా నిర్థారించారు. 

పోస్టు మార్టం అనంతరం హత్యేనని నిర్ధారణ అవడంతో ఏపీ ప్రభుత్వం కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. సిట్‌లో 5 పోలీసు బృందాలు పనిచేయనున్నాయి. తక్షణం న్యాయవిచారణ చేపట్టాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు పంపారు. సిఐడీ విభాగం అడిషనల్ చీఫ్.. అజిత్ గార్గ్ నేతృత్వంలో దర్యాప్తు జరగనుంది. పోలీసులకు కొన్ని కొత్త వ్యక్తుల వేలిముద్రలు కనిపించినట్లు చెబుతున్నారు. మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో క్లూస్ టీం పని చేస్తోంది.

Sudhakar Reddy
suspected
Vivekananda Reddy murder
kadapa
sit

మరిన్ని వార్తలు