విదేశీయులకు ట్రంప్ చురకలు: మాకు మనుషులు కావాలి.. మీరొద్దు!!

Submitted on 7 February 2019
 students return from us  because of poverty


పైసా పైసా కూడబెట్టి.. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకుని తిరిగి రావాలని కలలుగన్న మధ్య తరగతి కుటుంబాల జీవితాల్లో పెద్ద షాక్. డబ్బులు సంపాదించడం మాట అటుంచి అక్కడ ఉండి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో అవస్థలు పడుతున్నారు భారత విద్యార్థులు. ఈ క్రమంలోనే అమెరికాలోని ఫార్మింగటన్ యూనివర్సిటీకి చదువుకునేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు అక్కడ ఉండేందుకు కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఖాళీ చేతులతో తిరిగి వచ్చేస్తున్నారు. అమెరికా వెళ్లి చదువుకుంటూనే ఏదో ఉద్యోగం సంపాదించుకుందామని కన్న కలలన్నీ వట్టిగానే మిగిలిపోయాయి. 

దానికి ముమ్మాటికి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే కారణం. అగ్రదేశం ప్రెసిడెంట్ ట్రంప్.. అమెరికా వలసదారులందరికీ ఇమిగ్రేషన్ వీసాలు తప్పనిసరి అంటూ అవి లేని వారు వీలైనంత త్వరగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఒకసారి రిజెక్ట్ అయిపోయిన వీసాతో మరోసారి ప్రయత్నించే అవకాశం కూడా కోల్పోతున్నారు విద్యార్థులు. ఇలా వెళ్లేందుకు రూ.20లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ పోసిన విద్యార్థులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. విదేశాలకు వెళ్లి డబ్బులతో తిరిగొస్తారు చేసిన అప్పులకు రెండింతలు సంపాదిస్తారని అనుకున్న కుటుంబ సభ్యుల కలలు గంగలో కలిపేస్తున్నారు. 

ఈ బాధితుల్లో ఒకడైన ఎల్బీ నగర్‌లోని రమేశ్‌ ఆవేదన ఇలా ఉంది.'చిట్ ఫండ్ కంపెనీలో ఉద్యోగి అయిన మా నాన్నకు ఒకరోజు బ్యాంకు మేనేజర్ ఫోన్ చేశాడు. మీ అబ్బాయి అమెరికా నుంచి తిరిగొచ్చేశాడు. మీరు 4నెలల్లోగా బడ్డులు మొత్తం తిరిగి చెల్లించాలి లేదంటే తాకట్టు పెట్టిన ఇళ్ల స్థలాన్ని జప్తు చేస్తాం' అని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందట. నార్త్ వెస్టరన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివేందుకు 2014లో అమెరికా వెళ్లాడు రమేశ్. నెలకు 3,200డాలర్లతో ఉద్యోగం దొరికింది. హఠాత్తుగా అతను చదువుతున్న యూనివర్సిటీ అక్రిడేషన్ కోల్పోయింది. దీంతో గుర్తింపు లేని యూనివర్సిటీ విద్యార్థులందరినీ తిరిగి పంపేసే క్రమంలో రమేశ్ కూడా ఇండియాకు తిరిగొచ్చేశాడు. 

ఇలా వందల్లో వేలల్లో విద్యార్థులు నిరాశగా భారత్‌కు తిరిగొచ్చేస్తున్నారు. ఇమిగ్రేషన్ వీసాలుంటేనే మనుషులు అన్నట్లు లేకపోతే పనికిరారనే విధంగా ట్రంప్ వైఖరి నడుస్తోంది. ఇదిలా ఉంచితే, వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. మా దేశంలో నిరుద్యోగం చాలా తక్కువ సంఖ్యలో ఉంది. మా కంపెనీల్లో పని చేసేందుకు, పరిశ్రమల్లో శ్రమించేందుకు మనుషులు కావాలి. లీగల్‌గా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కష్టపడతామనే వాళ్లకు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. అక్రమంగా వస్తే మాత్రం ఒప్పుకునేదే లేదు' అంటూ వివరించాడు. 

donald trump
immigration visa
usa
usa#jobs# increase#

మరిన్ని వార్తలు