ఈ బస్సుకు సూర్యుడే డ్రైవర్.. రూ.15 లక్షలే!

Submitted on 17 January 2019
Students Design Driverless Bus That Runs on Solar Power, Cost 15 Lakh

అద్భుతాలు.. మనోళ్లూ సృష్టించగలరు. సరికొత్త టెక్నాలజీని రూపొందించడంలో మనోళ్లేం తక్కువ కాదని నిరూపించారు. ఓ మోడ్రాన్ బస్సును డిజైన్ చేశారు. ఈ బస్సుకు డ్రైవర్ అక్కర్లేదు. సూర్యుడే డ్రైవర్. సోలార్ ఎనర్జీతో నడుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ  పెట్రోల్, డీజిల్ ఇందనంతో నడిచే వాహనాలు, గ్రిడ్ ఆధారిత ఎలక్ట్రసిటీ ఛార్జింగ్, సీఎన్ జీ వంటి వాహనాలనే చూశాం. సోలార్ శక్తితో నడిచే తొలి బస్సును భారతీయ పరిశోధకులు కనుగొన్నారు. ఈ బస్సును ఒకసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. యూనివర్శిటీలో 50 మంది ఫ్యాకల్టీ మెంబర్స్, 300 మంది విద్యార్థులు కలిసి వర్క్ షాపుల్లో ఈ బస్సును సృష్టించారు. ఇంతకీ, దీని ధర ఎంతో తెలుసా? రూ. 15 లక్షలు మాత్రమేనట. సోలార్ ప్యానెల్స్ ఈ బస్సుకు అమర్చడంతో రెండు కిలోవాట్ల వరకు విద్యుత్ ను జనరేట్ చేస్తుంది. ఇందులో మొత్తం ఆరు యాసిడ్ బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది. డ్రైవర్ లేకపోయినా ఈ బస్సు సెన్సార్ల సాయంతో అన్నివైపులకు సులభంగా ప్రయాణిస్తుంది. 2014లో డ్రైవర్ లేని గోల్ఫ్ కార్ట్ ను రూపొందించామని లవిలీ ప్రొఫెసనల్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ లీడర్ మన్ దీప్ సింగ్ వెల్లడించారు. 

పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రసిటీపై ఆధారపడని బస్సును ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన అప్పుడే పుట్టిందని సింగ్ తెలిపారు. ఆ ఆలోచన నుంచి ఉద్భవించిన బస్సు ఈ సోలార్ బస్సు అని సింగ్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ను రూపొందించడానికి ఏడాది సమయం పట్టినట్టు మన్ దీప్ తెలిపారు. ఈ బస్సు తయారీలో టెక్నికల్ వర్క్ లో సాయం చేసినట్టు మస్కన్ అనే విద్యార్థి చెప్పాడు. బస్సులోని సెన్సార్ సాయంతో లోకేషన్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని తెలిపాడు. 1500 కేజీలు ఉండే ఈ బస్సులో 15 మంది వరకు కూర్చొవచ్చు. యూనివర్శిటీ లోపల వరకు మాత్రమే ఈ బస్సును వినియోగించనున్నారు. రోడ్డుపై వెళ్లే బస్సును భవిష్యత్తులో రూపొందిస్తామన్నారు. ఇటీవల గూగుల్, ఎలాన్ మస్క్ టెస్లా రూపొందించిన ఆటోమెటేడ్ కారును పోటీగా ఈ బస్సు ప్రాజెక్ట్ ను రూపొందించారా? అనే ప్రశ్నకు.. ‘‘ఇప్పుడు కాదు. టెస్లా ప్రావిణ్యం చాలా పెద్దది. ప్రస్తుత స్థాయిలో మేం టెస్లాతో పోటీ పడలేం. కానీ, రానున్న రోజుల్లో టెస్లా పోటీదారులతో పోటీపడగలమని మాత్రం చెప్పగలం’’ అని మన్ దీప్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Driverless Bus
Solar Power
solar energy
autonomous vehicle
Lovely Professional University

మరిన్ని వార్తలు