నోరూరిస్తున్న ఫేమస్‌ స్పెషల్‌ వంటకాలు : స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 

Submitted on 12 February 2019
Street Food Festival in vishaka : Famous Special Recipes

విశాఖ : బాంబో చికెన్‌ తినాలంటే అరకు వెళ్ళాలి. కాజాలు తినాలంటే కాకినాడ వెళ్లాలి. పూతరేకులు తినాలంటే ఆత్రేయపురం వెల్ళాలి. కానీ అన్నీ ఒక్కచోటే తినాలంటే మాత్రం విశాఖ వెళ్లాలి. అదెలాఅనుకుంటున్నారా.. అయితే ఓసారి ఆవైపు ఓ లుక్కేయండి. ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉండే విశాఖ ఆర్కేబీచ్‌ .. ఇప్పుడు ఫుడ్‌ లవర్స్‌తో నిండిపోయింది. స్ట్రీట్‌ ఫుడ్‌ ఘుమఘుమలు ప్రతీ ఒక్కరినీ కదలనివ్వడం లేదు. వెరైటీ ఫుడ్‌ ఐటమ్స్‌ టేస్ట్‌ చేసేందుకు పర్యాటకులు, స్ధానికులు పరుగులుపెడుతున్నారు. 

పేదరిక నిర్మూలన సంస్థ, జీవీఎంసీ ఆధ్వర్యంలో 3 రోజులు పాటు విశాఖ ఆర్కేబీచ్‌లో .. స్ట్గీట్ పుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ పుడ్ పెస్టవల్ జరుగుతుంది. ఇక్కడ దాదాపు 100 ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫేమస్‌ వంటకాలు.. ఆహార ప్రియులకు ఆహ్వానం పలుకుతున్నాయి. 

రాష్ట్రంలో ఉన్న మహిళలను చిరు వ్యాపారులను ప్రోత్సహించే ఉద్దేశంతో .. ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందని మెప్మా నిర్వహకులు తెలిపారు. స్వయం సహాయక సంఘాలు చేసిన కాకినాడ కాజా, మాడుగుల హల్వా, గోదావరి జిల్లాలో అత్యంత పేరొందిన పచ్చళ్ళు, అరకు బెంబో చికిన్, గుంటూరు నేతి పిండివంటలు, స్వీట్ కార్న్‌ అందరినీ నోరూరిస్తున్నాయి. అంతేకాదు 20 రకాల వెరైటీ దోసెలు, రాగిసంకటి, జొన్న రొట్టెలు, బందర్ లడ్లు వంటివి ఫుడ్‌ లవర్స్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.   

ఈ స్ట్రీట్ పుడ్ ఫెస్టవల్ కార్యక్రమానికి  కేంద్రం జీవీఎంసీ నిధులు కేటాయించడంతో .. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఎలాంటి రుసుము విధించలేదు. స్వయం సహయక సంఘాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని  అధికారులు చెబుతున్నారు. ఈ స్టాల్స్‌ను మరిన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తామంటున్నారు. యమీ యమీ ఫుడ్‌ ఐటమ్స్‌ని టేస్ట్‌ చేసేందుకు పర్యాటకులు తరలిరావడంతో.. స్టాల్స్‌ అన్నీ కిటకిటలాడుతున్నాయి. సో.. మీరూ ఆ ఘుమ ఘుమలను టేస్ట్ చేయండి.

Street Food Festival
vishaka
Famous Special Recipes

మరిన్ని వార్తలు