ఫిట్ నెస్ కోసం : కారును తోసిన సుధీర్ బాబు

Submitted on 14 September 2019
Star Sudheer Babu Workout With Car

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు దేహ ధారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాడు. జిమ్‌లో ఎక్సర్ సైజులు చేస్తుంటాడు. కానీ వెరైటీగా కసరత్తులు చేశాడు ఈ హీరో. రోడ్డుపై కారును తోస్తూ సరికొత్త వ్యాయామం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 

జిమ్‌లో రోటీన్‌గా చేసే వర్కవుట్‌లు కాకుండా డిఫరెంట్‌గా ఆలోచించాడు సుధీర్. కారుతో వర్కవుట్..ఎప్పుడూ రోటీన్‌గా బోరింగ్ కసరత్తులు  ఎందుకు అంటూ తన ట్రైనర్ జాఫర్ ఆలీ అన్నాడని పోస్టులో తెలిపాడు. అందుకే కారును తోయాలని డిసైడ్ అయినట్లు వెల్లడించాడు. మీ శరీరానికి కాస్త ఇంధనం ఇచ్చి..కారును కాసేపు తోయండి..అంటూ ట్వీట్ చేశారు. కారును రోడ్డుపై రెండు చేతులతో తోశాడు. పక్కనే అతని ట్రైనర్ ఉన్నారు.

సుధీర్ చేసిన ఈ న్యూ కసరత్తుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దుర్శకత్వంలో చేయబోయే సినిమాకు సుధీర్ కొన్ని రోజులుగా వర్కవుట్ చేస్తున్నాడు. ఇందులో నాని కూడా నటిస్తున్నాడు. మల్టీసార్టర్‌గా వస్తున్న ఈ సినిమాకు వి అని పేరు పెట్టినట్లు సమాచారం. ఆదితిరావు, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Star
Sudheer Babu
Workout
Car

మరిన్ని వార్తలు