ఉల్లి పట్టు యుద్ధం : కిలో ఉల్లి కోసం తొక్కిసలాటలు, ఫైట్లు

Submitted on 7 December 2019
stampede, fight for kilo onions

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉల్లి ధరలు ఉన్నాయి. ఉల్లి ధరలు డబుల్ సెంచరీ దిశగా వెళ్తున్నాయి. దీంతో ఉల్లి కోసం జనాలు పాట్లు పడుతున్నారు. కాగా, ఏపీలో కిలో ఉల్లిని రూ.25కే ఇస్తోంది ప్రభుత్వం. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిని రూ.25కే విక్రయిస్తోంది. ఈ ఉల్లిపాయల కోసం ప్రజలు పోటీలు పడుతున్నారు. కిలో ఉల్లి కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల తొక్కసలాటలు చోటు చేసుకుంటున్నాయి. ఫైట్లు కూడా జరుగుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మార్కెట్ యార్డులో సబ్సిడీపై ఇస్తున్న ఉల్కి కోసం జనాలు కొట్టుకునే పరిస్థితి కనిపించింది. మార్కెట్ యార్డులో సబ్సిడీ కింద ఇస్తున్న ఉల్లి కోసం మహిళలు, పురుషులు, వృద్ధులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలు కడుతున్నారు. కిలో ఉల్లి కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిరీక్షిస్తున్నారు. కాగా రద్దీ పెరగడంతో క్యూలైన్ లో తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి ఫైటింగ్ లు జరుగుతున్నాయి.

ఈ తోపులాటల్లో పలువురు స్వల్పంగా గాయపడుతున్నారు. ఒక పాలకొల్లు మార్కెట్ యార్డులోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి ఉంది. దీంతో అధికారులు స్పందించాలని తోపులాటలు, ఘర్షణలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Stampede
fights
kilo
onions
Subsidy
West Godavari
Palakollu
market yard
cm jagan
onion rates

మరిన్ని వార్తలు