సిద్దిపేటలో కోలాహలం : రూ.10 చీరల కోసం తొక్కిసలాట

Submitted on 16 February 2019
Stamepede In CMR Shopping Mall, Womens Rush For Sarees

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మాల్ నిర్వాహకులు 10 రూపాయలకే ఒక చీర ఆఫర్ ప్రకటించారు. భలే మంచి చౌక భరం అంటూ.. చీరలు కొనేందుకు మహిళలు ఎగబడ్డారు. భారీగా షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20మంది మహిళకు గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా ఊహించని విధంగా మహిళలు రావడం, వారు పోటీలు పడి ముందుకు దూసుకురావడంతో మాల్ నిర్వాహకులకు వారిని కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో తొక్కిసటాలకు దారితీసింది.

 

10 రూపాయలకు టీ కూడా రావడం లేదు. అలాంటిది ఏకంగా చీర వస్తుందంటే ఎవరైనా వదులుకుంటారా. అందుకే జనాలు ఎగబడ్డారు. షాపింగ్ మాల్ ముందు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. వెనకబడితే చీర అందుతుందో లేదో అన్న ఆత్రుతలో కొందరు షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మాల్‌ నిర్వాహకులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

 

కాగా, తమ సేల్స్ పెంచుకునేందుకు, పబ్లిసిటీ కోసం షాపింగ్ మాల్స్ ఓనర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. జనాలను ఆకర్షించేందుకు అడ్డమైన ఆఫర్లు ప్రకటించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. చీరల కోసం మహిళలు ఎగబడటం, అక్కడ తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగాయి. షాపింగ్ మాల్స్ యాజమాన్యం తీరుపై ప‌లువురు మండిప‌డుతున్నారు. మీ బిజినెస్ కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడతారా? అని ఫైర్ అవుతున్నారు.

Siddipet
stampede in cmr shopping mall
womens rush for sarees
saree offer
injuries for women
stampede for sarees

మరిన్ని వార్తలు