ఇంటర్ పాసైతే చాలు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC CHSL)లో ఉద్యోగాలు 

Submitted on 4 December 2019
SSC CHSL 2020 Notification (Out), Exam Dates, Application

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హత గల అభ్యర్ధుల 
కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(CHSL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో విభాగాల 
వారీగా పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్(SA), డేటా ఎంట్రీ ఆపరేటర్(DEO), లోవర్ డివిజనల్ 
క్లర్క్(LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ 
లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా చెల్లించవచ్చు.

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్ధులు రూ.100  చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, ఎక్స్-సర్వీసెస్ మెన్, మహిళా అభ్యర్ధులకు 
మాత్రం ఫీజు మినహాయింపు ఉంది. 
వయోపరిమితి : అభ్యర్ధులకు 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు 
వర్తిస్తుంది.

ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మెుదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్1) లో పాసైనవాళ్లు రెండో 
దశ డిస్క్రిప్టివ్ పేపర్ (టైర్2) రాయాలి. ఇందులో క్వాలిఫై అయినవాళ్లు మూడో దశ  టైపింగ్ టెస్ట్, సిల్క్ టెస్ట్ 
(టైర్3) లో పాస్ కావాలి. నాలుగో దశలో  అభ్యర్ధులను  డాక్యూమెంట్ వెరిఫికేషన్  ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదిలు : 
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 03,2019
దరఖాస్తు చివరి తేది : జనవరి 10,2020
ఆన్ లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: జనవరి 12,2020
ఆఫ్ లైన్ చలానా జనరేషన్ కు చివరి తేది : జనవరి 12,2020
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేది : జనవరి 14,2020
టైర్-1 పరీక్ష తేదిలు : మార్చి 16 - మార్చి 27,2020
టైర్-2 పరీక్ష తేది : జూన్ 28,2020

ssc
jobs
notification
release
exam dates
application
chsl

మరిన్ని వార్తలు