శ్రీశైలంలో భక్తులపైకి దూసుకెళ్లిన కారు

Submitted on 27 May 2019
Srisailam Car Accident

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయంలో కారు బీభత్సం సృష్టించింది. కొత్త కారుకు పూజ చేసిన అనంతరం నిమ్మకాయలును తొక్కించే క్రమంలో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. కోపోద్రిక్తులైన ఇతర భక్తులు కారును ధ్వంసం చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయంలో ఓ వ్యక్తి కొత్త కారుతో వచ్చాడు. అనంతరం పూజలు నిర్వహించాడు.

పూజ చేసిన అనంతరం నిమ్మకాయలను తొక్కించేందుకు స్టార్ట్ చేశాడు. యాక్సిలెటర్‌ను గట్టిగా నొక్కడంతో కారు అదుపు తప్పింది. ముందున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరి బంధువులు అరుపులు, రోదనలు పెట్టారు. కోపోద్రిక్తులై అక్కడనే ఉన్న పూలకుండీలను తీసుకుని కారును ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Srisailam
Car Accident
Sakshi Ganapati
Temple

మరిన్ని వార్తలు