ఏ తప్పూ చేయలేదు..టీడీపీ వాళ్లే ఇరికించారు..జగన్ పైదాడి కేసు నిందితుడు 

Submitted on 25 May 2019
Srinivasa Rao released on bail

రాజమండ్రి : విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం ఉదయం బెయిల్ పై విడుదలయ్యాడు. జగన్ తో ఫోటో దిగి, నేను రాసుకున్న ప్రజా సమస్యలు ఆయనకు ఇద్దామని వెళ్లానని, ఆ సమయంలో నా జేబులో కత్తి, ఫోర్కులు ఉన్నాయని..అందులో ఆయనకు ఏమి గుచ్చుకుందో కూడా నేను చూసుకోలేదని ...నేను జగన్ హత్య చేయాలని అనుకోలేదని శ్రీనివాస్ చెప్పాడు.

" ప్రతి కుటుంబం జగన్ ని తమ కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవుతున్నారు. జగన్ సీఎం అవుతారు. ఆయన ప్రజాసమస్యలు చెప్పమని అడిగారు. అందుకని ప్రజాసమస్యలు అన్నీ పేపరు మీద రాసుకుని ఆయనకు ఇవ్వాలని వెళ్లాను."  నేను విశాఖ విమానాశ్రయం క్యాంటిన్ లో కుక్ గాపని చేస్తున్నా...కాబట్టి జేబులో ఏముందో నేను చూసుకోలేదు. ఫ్రూట్ సలాడ్ నైఫ్ జైబులో ఉందనేది నేను చూసుకోలేదు. జగన్ ను కలవాలనే ఆత్రుత తప్ప  నాకే దురుద్దేశ్యం లేదని....ఆయన్ను కలిసే టైమ్ లో పొరపాటున ఆ కత్తి గుచ్చుకుందే తప్ప, సింపతీ కోసం కానీ ఇంకేదో ఆశించలేదని...అసలు నేను హత్యా యత్నం చేయలేదని శ్రీనివాస్ చెప్పాడు. ఎలాగూ ఓడిపోతున్నాము..జగన్ కు మచ్చతేవాలన్న ఉద్దేశ్యంతో  ప్రభుత్వమే అదంతా సృష్టించిందని అతను వివరించాడు. 

2018,అక్టోబర్ 25న వైసీపీ అధ్యక్షుడు జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ 7 నెలల జైలు శిక్ష అనంతరం బెయిల్ పై శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. "నేను జగన్ అభిమానిని, కావాలంటే నార్కో ఎనాలసిస్ టెస్టులకు కూడా రెడీ...నార్కో ఎనాలసిస్ టెస్టుల్లో జగన్ అభిమాని అని రాకపోతే శిరశ్చేధానికి కూడా సిధ్ధం"  అని శ్రీనివాస్ సవాల్ విసిరాడు. నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే జగనన్నే కారణం అని అతను చెప్పాడు. 

visakhapatnam Air port
Murder attempt
YS Jaganmohan Reddy
Srinivasa Rao
Chef
Andhra Pradesh

మరిన్ని వార్తలు