మార్షల్ : ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ లుక్

Submitted on 16 February 2019
Srikanth Look in Marshal Movie-10TV

ఇటీవలే 125 సినిమాలు పూర్తి చేసుకున్న జూబ్లీ స్టార్ శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సినిమా.. మార్షల్.. ఈ సినిమాతో అభయ్ హీరోగా పరిచయమవుతున్నాడు. మేఘా చౌదరి హీరోయిన్.. ఏవీఎల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై, అభయ్ అడక నిర్మిస్తుండగా, జై రాజసింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. సైంటిఫిక్ మెడికల్ ధ్రిల్లర్‌గా రూపొందుతున్న మార్షల్ నుండి ఈ మధ్య రిలీజ్ చేసిన శ్రీకాంత్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. శ్రీకాంత్ క్యారెక్టర్ గుర్తుండిపోయేలా ఉంటుందని దర్శకుడు చెప్తున్నాడు. అభయ్ క్యారెక్టర్ హుందాతనంతో కూడి ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు, మెసేజ్ కూడా ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు. సుమన్, వినోద్ కుమార్, శరణ్య, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : వరికుప్పల యాదగిరి, కెమెరా : స్వామి.ఆర్.ఎమ్. ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్, ఆర్ట్ : రఘు కులకర్ణి, ఫైట్స్ : నాభ, సుబ్బు.

Srikanth
Abhay Adaka
Yadagiri Varikuppala
Jai Raaja Singh

మరిన్ని వార్తలు