చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి

Submitted on 22 March 2019
Sri Reddy assaulted by financier and assistant at her home

చెన్నై: కాంట్రవర్సీకి కేరాఫ్ నటి శ్రీరెడ్డి. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో, అసభ్యకరమైన చేష్టలతో తరుచూ న్యూస్ లోకి ఎక్కుతోంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా  కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి,  తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళనాడులోనే మకాం వేసింది. వలసరవక్కంలోని అన్బు నగర్ లో నివాసం ఉంటోంది.
Read Also : యడ్డీ డైరీ లీక్స్ ప్రకంపనలు : బీజేపీ నేతలకు భారీగా ముడుపులు

మరోసారి శ్రీరెడ్డి వార్తల్లోకి ఎక్కింది. తనపై ఇద్దరు వ్యక్తులు దాడికి యత్నించారని పోలీసులకు పిర్యాదు చేసింది. ఫైనాన్షియర్ సుబ్రమణి, అతడి అసిస్టెంట్ గోపి.. మార్చి 21వ తేదీన తన అపార్ట్ మెంటుకు వచ్చారని, దాడికి యత్నించారని శ్రీరెడ్డి ఆరోపించింది. చంపేస్తామని కూడా బెదిరించారని కంప్లయింట్ ఫైల్ చేసింది. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. శ్రీరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు  చేపట్టారు. నిజానిజాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

శ్రీరెడ్డి.. లైంగిక వేధింపులు, దాడుల ఆరోపణలు చేయడం కొత్త కాదు. ఈమె లిస్ట్ లో చాలామంది బాధితులు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ, తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్, అభిరామ్ దగ్గుబాటి, రాఘవ లారెన్స్ లాంటి ప్రముఖలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా ''మా'' ఆఫీస్ ముందు నగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించింది. తన జీవితం ఆధారంగా ''రెడ్డీ డైరీస్'' పేరుతో బయోపిక్ వస్తున్నట్టు శ్రీరెడ్డి వెల్లడించింది.
Read Also : చంద్రబాబు సరికొత్త స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే అట

Sri Reddy
assaulted
financier
file complaint
Valasaravakkam
tamilnadu
casting couch

మరిన్ని వార్తలు