Sports

Sunday, January 28, 2018 - 21:01

ఢిల్లీ : స్విస్ మాస్టర్, డిఫెండింగ్ చాంపియ‌న్‌ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న తొలి మెన్స్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇవాళ జ‌రిగిన ఆస్ట్రేలియన్‌ ఫైన‌ల్లో ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో పోరాడి విజ‌యం సాధించాడు ఫెడెక్స్‌. కెరీర్‌లో ఇది ఆరో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్. ఈ విజయంతో... ఆరుసార్లు...

Sunday, January 28, 2018 - 20:59

ముంబై : ఎంతగానో ఆసక్తి రేపిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఇవాళ్టి వేలంలో... ఇండియన్ ప్లేయర్ జయదేవ్ ఉనద్కట్ పదకొండున్నర కోట్లతో సత్తాచాటారు. రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఈ వేలంలో.. బెన్ స్టోక్స్ తరువాత అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా ఉనద్కట్ నిలిచాడు. భారత ప్లేయర్లలో మనీష్ పాండే, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, కృనాల్ పాండ్యాలాంటి స్టార్స్ కూడా...

Sunday, January 28, 2018 - 15:32

ఢిల్లీ : ఐపీఎల్ 2018 వేలం కొనసాగుతోంది. జూనియర్ క్రికెటర్లు హాట్ కేకులా కొనుగోలు అయిపోయారు. ముంబైలో రెండో రోజు వేలం పాట కొనసాగుతున్నాయి. వివిధ ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొని భారీగా డబ్బులు ప్రకటిస్తూ క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ విధ్వంసకర బ్యాటింగ్ కు చిరునామాగా నిలిచే 'క్రిస్ గేల్' ను మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు...

Saturday, January 27, 2018 - 21:08

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. విజయం దిశగా దూసుకెళుతున్న సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అదరగొట్టారని చెప్పవచ్చు. 241 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ బ్యాటింగ్‌ ఆరంభించారు. హషీమ్ ఆమ్లా...

Saturday, January 27, 2018 - 13:11

ఢిల్లీ : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌-2018 వేలానికి తెరలేచింది. వేలానికి వచ్చిన మొదటి ఆటగాడు శిఖర్‌ ధావన్‌. ఆ తర్వాత రవిచంద్రన్‌ అశ్విన్‌, కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ గేల్‌, బెన్‌ స్టోక్స్‌ వచ్చారు. టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌, వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ను కొనుగోలు చేసుకునేందుకు ఏ ఒక్క ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. గత ఏడాది...

Wednesday, January 24, 2018 - 09:46

ఢిల్లీ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా...దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌కు సన్నద్ధమైంది. వాండరర్స్ ఫాస్ట్‌ అండ్‌ బౌన్సీ పిచ్‌పై భారత బ్యాటింగ్‌కు దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. తొలి రెండు టెస్ట్‌ల్లో  తేలిపోయిన టీమిండియా ఆఖరి టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.సెకండ్‌ టెస్ట్‌తోనే సిరీస్‌...

Sunday, January 21, 2018 - 09:46

ఢిల్లీ : భారత అంధుల క్రికెట్‌ జట్టు మరోసారి సత్తా చాటింది. వన్డే వరల్డ్‌కప్‌లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. శనివారం షార్జాలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో భారతజట్టు పాక్‌ను చిత్తుచేసింది. రెండు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2014లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ ఇండియా జట్టు.. పాక్‌పైనే విజయం సాధించింది....

Saturday, January 20, 2018 - 07:42

ఆస్ట్రేలియా : అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.పృద్వీ షా సారధ్యంలోని భారత జట్టు గ్రూప్‌ దశను ఓటమంటూ లేకుండా హ్యాట్రిక్‌ విజయాలతో ముగించింది. తొలి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ,పాపువా న్యూ గినియా జట్లపై సునాయాస విజయాలు సాధించిన భారత్‌... 3వ గ్రూప్‌ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టును చిత్తు చేసింది. గ్రూప్‌-బీ పాయింట్స్...

Thursday, January 18, 2018 - 06:35

ఢిల్లీ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో విఫలమైంది.3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను సౌతాఫ్రికా మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. బౌలర్లు అంచనాలకు మించి రాణించినా భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో రెండో టెస్ట్‌లోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగిన నంగ్డీ...రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6...

Wednesday, January 17, 2018 - 16:11

సెంచూరియన్ : సౌత అఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. సౌత్ అఫ్రికా 131 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్ ను 2 0 తేడాతో సౌత్ అఫ్రికా స్వంతం చేసుకుంది. సౌత్ అఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 335, రెండో ఇన్నింగ్స్ లో 258 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 307 రెండో ఇన్నింగ్స్ లో 151 పరుగులు చేసింది. 

Monday, January 15, 2018 - 08:29

ఢిల్లీ : అండర్‌ 19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌ బిలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై వంద పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడుసార్లు ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత్‌.. పటిష్ఠ ఆసీస్‌‌పై గెలుపుతో ఈ టోర్నీలో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది. భారత్‌ నిర్దేశించిన 329 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చతికిలబడింది. 42.5...

Saturday, January 13, 2018 - 20:56

పెద్దపల్లి నుండే మళ్లీ పోటీ చేస్తానని హెచ్ సీఏ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత వివేక్ పేర్కొన్నారు. కానీ పార్లమెంట్..కు సుమన్ పోవచ్చు..ఎమ్మెల్యేగా తనను పంపొచ్చు..ఏది ఏమయినా సీఎం కేసీఆర్ ఫైనల్ నిర్ణయమని హెచ్ సీఏలో నెలకొన్న పరిస్థితులు..ఇటీవలే ప్రముఖ క్రికేటర్ అజహారుద్దీన్ తో నెలకొన్న వివాదం..ఇతరత్రా అంశాలపై ఆయన టెన్ టివి 'వన్ టు వన్' కార్యక్రమలో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో...

Saturday, January 13, 2018 - 20:40

మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఫాల్స్ ఐడెంటిడీ కార్డు పెట్టుకుని సమావేశానికి వచ్చారని హెచ్ సీఏ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. టెన్ టివి వన్ టు వన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అతను హెచ్ సీఏ మెంబర్ కాదా ? అని అడగాలని సూచించారు. మెంబర్ కాని అతను ఫాల్స్ ఐడెంటిడీ కార్డు పెట్టుకుని రావచ్చా ? అని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో అజారుద్దీన్ కు బీసీసీఐ...

Saturday, January 13, 2018 - 11:19

ఢిల్లీ : సఫారీ గడ్డపై... బ్యాటింగ్‌లో ఆపసోపాలు పడుతున్న భారత్‌కు నేటి నుంచి రెండో గండం ప్రారంభమవుతుంది. తొలిటెస్టులో విజయానికి దగ్గరైనట్లే కనిపించి... చివర్లో ఓటమితో సరిపెట్టుకున్న కోహ్లీ సేన.. రెండో టెస్టుపై.. నమ్మకంతో ఉంది. సెంచూరియన్ పార్క్ వేదికగా... సౌతాఫ్రికాతో కోహ్లీ సేన సై అంటోంది. రెండో టెస్ట్‌లోఅన్ని విభాగాల్లో బలంగా  ఉన్న దక్షిణాఫ్రికా మరోసారి...

Tuesday, January 9, 2018 - 08:38

దక్షిణాఫ్రికా : టీమ్‌ ఇండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. సఫారీ గడ్డపై భారత్‌కు తొలి పరాభావం ఎదురైంది. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైంది.  పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో... బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక విరాట్‌సేన చతికిలపడింది.72 పరుగుల తేడాతో ఓడి... మూడుటెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికాకు 1-0...

Monday, January 8, 2018 - 22:11

దక్షిణాఫ్రికా : సఫారీ గడ్డపై భారత్‌కు తొలి పరాభావం ఎదురైంది. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైంది. నిన్నటి వర్షంతో.. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో... బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది టీమిండియా. కేవలం 135 పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేసిన భారత్‌ విజయానికి 72...

Monday, January 8, 2018 - 17:57

కేఫ్ టౌన్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 130 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ, బుమ్రాలు విజృంభించారు. దక్షిణాఫ్రికా 207 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

 

Monday, January 8, 2018 - 06:28

హైదరాబాద్ : భారత క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు హెచ్‌సీఏ స్పెషల్‌ మీటింగ్‌లో చేదు అనుభవం ఎదురైంది. సమావేశంలో పాల్గొనేందుకు అజార్‌ను అనుమతించలేదు.. దీనిపై అజారుద్దీన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమాధానం కోసం అజారుద్దీన్‌ చాలాసేపు ఎదురుచూస్తూ ఉండడటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి....

Saturday, January 6, 2018 - 07:27

కేప్ టౌన్ : మ్యాచ్‌ ఆరంభమైన 30 నిమిషాల్లోనే ముగ్గురు టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపి భువనేశ్వర్‌ కుమార్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 4.5 ఓవర్లకు 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ భారత పేసర్లపై ఎదురుదాడికి దిగాడు. అప్పటి వరకు చెమటలు పట్టించిన భువీ బౌలింగ్‌లో...

Friday, January 5, 2018 - 11:46

టీం ఇండియా పాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ చేసిన ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సం సందర్భంగా షమీ తన అభిమానులను ఉద్దేశించి నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అందరికి హ్యాపీ న్యూఇయర్ అని పూలతో అలంకరించిన శివలింగ ఫొటోను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో దూమరం చెలరేగింది. దీంతో షమీ ఆ పోస్టును...

Saturday, December 30, 2017 - 13:45

టీఇండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ఆటలోనే కాదు మాటలోను తన ప్రముఖ్యన్ని చాటుకున్నారు. పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ ఆక్తర్ ను యువీ తన ట్విట్ తో ఆటపట్టించాడు. సోషల్ మీడియా వేదకగా ఆక్తర్ ఓ ఫొటోను ట్విట్టర్ పోస్టు చేశాడు. ఆ ఫొటోలో ఆక్తర్ హెల్మెంట్ పట్టుకుని, గ్టౌజ్ ధరించి, కళ్ల అద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఆ ట్విట్ కు యువీ నుంచి బౌన్సర్ వంటి సమాధానం...

Thursday, December 28, 2017 - 15:37

ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరుపున ఆడే కృనాల్ పాండ్యా పెళ్లి మెహెందీ ఫంక్షన్ సందర్భంగా అతని సోదరుడు టీం ఇండియ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. ఓ వైపు ముంబైలో విరాట్ కోహ్లీ రిసెప్షన్ జరుగుతుండగా మరో వైపు కృనాల్ పాండ్యా మెహెందీ ఫంక్షన్ జరిగింది. ఈ నెల 27న కృనాల్ పాండ్యా తన గర్లఫ్రెండ్ పంకురి శర్మను పెళ్లి చేసుకున్నాడు. మెహెందీ వేడుకగా ఇద్దరు అన్నదమ్ములు,...

Thursday, December 28, 2017 - 14:49

ముంబై : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రిసెప్షన్ లో బాలీవుడ్ తారలు, క్రీడకారులు తలుక్కుమన్నారు. బాలీవుడ్ బాద్ షా నూతన జంటతో స్టెప్పులేశారు. సచిన టెండూల్కర్, కుంబ్లే, ధోని వారి ఫ్యామిలీతో విందు హాజరైయ్యారు. ఈ విందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ పంజాబీ డ్యాన్స్ చేసి అందరిని అలరించారు. వారు డ్యాన్స్ చేయడమే కాకుండా విరాట్ తో కూడా స్టెప్పులెంచారు. 

Tuesday, December 26, 2017 - 16:49

ఢిల్లీ : ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో బ్యాడ్మింటెన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లకు ఆత్మీయ సన్మానం జరిగింది. రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌, ఢిల్లీలోని తెలుగు సంఘాల నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏపీ భవన్‌లో ఉన్న  షటిల్ కోర్టులో సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు షటిల్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద...

Monday, December 25, 2017 - 06:44

ఢిల్లీ : టీమిండియా 2017ను ఘనంగా ముగించింది. వాంఖడే వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి.. టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. టీ20 ఫార్మాట్‌లో రెండో ర్యాంకులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌...

Sunday, December 24, 2017 - 06:56

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కేదార్‌జాదవ్‌, బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు జట్టులో చోటు దక్కింది. అశ్విన్‌ , జడేజాకు మరోసారి నిరాశ ఎదురైంది. 2018లో సౌతాఫ్రికాలో జరిగే సిరీస్‌ కోసం వెళ్లే భారత క్రికెట్...

Sunday, December 24, 2017 - 06:55

ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ...శ్రీలంక ఆఖరి టీ20 మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.టీ20ల్లో తిరుగులేని టీమిండియా, శ్రీలంక మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌కు ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమైంది.కటక్‌,ఇండోర్‌ టీ20ల్లో భారీ విజయాలు సాధించిన భారత్‌...సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. కటక్‌ టీ20లో భారీ విజయం సాధించిన...

Pages

Don't Miss