Sports

Thursday, September 24, 2015 - 13:41

హైదరాబాద్ : రికార్డులున్నవి బద్దలు కొట్టడానికే అని మరోసారి నిరూపించాడు బేయర్న్‌ మ్యునిక్‌ స్ట్రైకర్‌ ...రాబర్ట్‌ లెవాండోస్కీ. బండెస్‌లీగాలో ఓల్ఫ్స్‌బర్గ్‌ జట్టుతో ముగిసిన లీగ్‌ మ్యాచ్‌లో పోలిష్‌ ప్లేయర్‌...బేయర్న్‌ మ్యునిక్‌ నయా స్ట్రైకర్‌ లెవాండోస్కీ పెద్ద సంచలనలమే సృష్టించాడు.బ్యాక్‌ టు బ్యాక్‌ గోల్స్‌తో రికార్డుల మోత మోగించాడు.

ఆకాశమే...

Wednesday, September 23, 2015 - 18:34

భారత గడ్డపై సఫారీ సిరీస్ వేటకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. అక్టోబర్ 2 నుంచి జరిగే టీ-20, 11 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ ల్లో పాల్గొనే జట్లను రెండుదేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు సభ్యులు బెంగళూరు జాతీయక్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న సన్నాహక శిబిరంలో కసరత్తులు చేస్తున్నారు. మూడుమ్యాచ్ ల టీ-20, ఐదుమ్యాచ్ ల వన్డే...

Wednesday, September 23, 2015 - 18:28

సౌతాఫ్రికాతో వచ్చేనెలలో జరిగే సిరీస్ కోసం తాను పూర్తిస్థాయిలో సిద్ధమయ్యానని బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించమే తన లక్ష్యమని ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ ప్రకటించాడు. జట్టులో సమతౌల్యం తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో శిక్షణ పొందుతున్న బిన్నీ..తన అభిప్రాయాలను మీడియా ముందు ఉంచాడు. టెస్ట్ మ్యాచ్ ల్లో...

Tuesday, September 22, 2015 - 15:02

క్రికెట్..ఇరు జట్లు తలపడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఇవి శృతి మించుతాయి కూడా. గతంలో పలువురు క్రికేటర్లు తలపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా ఇద్దరు క్రికేటర్లు గల్లిలో మాదిరిగా కలయబడి కొట్టుకున్నారు. వీరు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెర్మూడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లీవ్ లాండి కౌంటీ క్రికెట్...

Sunday, September 20, 2015 - 13:56

బెంగళూరు : సౌతాఫ్రికాతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 , వన్డే సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. టీ 20 జట్టులో సీనియర్ మోస్ట్‌...ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తిరిగి భారత టెస్టు జట్టులో చోటు సాధించాడు. ఆల్‌రౌండర్‌ రవీందర్‌ జడేజాను పక్కన పెట్టిన సెలక్టర్లు , యువ ఆల్‌రౌండర్‌ గురుకీరత్‌ సింగ్‌ వన్డే జట్టుకు ఎంపిక చేశారు.

అక్టోబర్ 2న...

Monday, September 14, 2015 - 10:59

న్యూయార్కు : మూడేళ్ల నిరీక్షణకు తెరపడలేదు..ఈసారి కూడా నిరాశ తప్పలేదు..విజయం దక్కుతుందని ఆశించాడు..కానీ నెరవేరలేదు..స్విస్ యోధుడు 'ఫెదరర్' గ్రాండ్ స్లామ్ కల చెదిరింది. యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్స్ ను సెర్బియో ఆటగాడు 'జకోవిచ్' ఎగురేసుకపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో 'జకోవిచ్' దే పై చేయి అయ్యింది. 6-4, 5-7, 6-4, 5-4...

Saturday, September 12, 2015 - 13:42

ప్రతిష్టాత్మక గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ అమెరికన్‌ ఓపెన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఏడు సార్లు చాంపియన్‌...స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌ 18వ గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్ టైటిల్‌ పైన కన్నేశాడు. 5 సార్లు అమెరికన్‌ ఓపెన్‌ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ నెగ్గిన ఫెదరర్‌ మరోసారి ఎలాగైనా టైటిల్‌ నెగ్గాలని పట్టుదలతో ఉన్నాడు. స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌....17 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్ టైటిల్స్...

Saturday, September 12, 2015 - 12:41

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించిన భారతీయుడిగా నిలిచాడు. 2015 అమెరికన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను స్విస్ వండర్ మార్టినా హింగిస్ జోడితో పేస్ గెలుచుకున్నాడు. ఫైనాల్లో అమెరికాకు చెందిన క్వెర్రీ - బెథానీల 6-4, 3-6, 10-7 పాయింట్ల తేడాతో వీరు గెలుపొందారు. ఈ విజయంతో లక్షా యాభై వేల డాలర్ల ఫ్రైజ్ మనీతో పాటు యూఎస్...

Thursday, September 10, 2015 - 10:42

హైదరాబాద్ : పట్టు పడితే అంతే.. ఉడుం కూడా ఇంచు కదలదు..! పోటీలోకి దిగాడంటే.. అతనికి పోటీనే ఉండదు..! ప్రత్యర్థి ఎవరైనా.. వార్‌ వన్‌సైడే..! పాల్గొన్న ప్రతిచోటా విజయమే. గేమ్‌ ముగిసిందంటే.. కంఠం కనకంతో మెరిసిపోవాల్సిందే..! లేదంటే.. కంచుతోనైనా మురిసిపోవాల్సిందే..! ఇదీ.. అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్‌లో తనదైన ముద్రవేసిన దేవీసింగ్ ఠాకూర్‌ చరిత్ర. మల్ల యుద్ధంలో...

Thursday, September 10, 2015 - 08:51

           న్యూఢిల్లీ : టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. తన దూకుడు ప్రవర్తనకు విరుద్ధంగా చాలా ఆచీతూచీ వ్యవహరిస్తున్నాడు. టీమ్‌ ఇండియా కొత్తగా అనుసరిస్తున్న దూకుడు వ్యుహం మూలంగా మైదానంలో తలెత్తిన వివాదాలపై స్పందించేందుకు టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాకరించాడు. శ్రీలంక పర్యటనలో పేసర్‌ ఇషాంత్‌ శర్మ లంక ఆటగాళ్లతో మైదానంలో...

Thursday, September 10, 2015 - 08:47

యు.ఎస్‌ ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా టైటిల్‌ దిశగా సాగుతోంది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా స్విస్‌ పార్ట్‌నర్‌ మార్టినా హింగిస్‌తో కలిసి సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సానియా జోడి వరుస సెట్లలో విజయం సాధించింది. చైనీస్‌ తైపీ జంట యుంగ్‌ జన్‌ చాన్‌, హవో చింగ్‌ చాన్‌లపై 7-6 (7-5), 6-1తో సానియా, హింగిస్‌ జోడి గెలుపొందింది. తొమ్మిదో...

Thursday, September 10, 2015 - 08:42

                      అమెరికా టెన్నిస్‌ స్టార్‌, వరల్డ్‌ నెం.1 సెరెనా విలియమ్స్‌ క్యాలెండర్‌ స్లామ్‌కు మరింత దగ్గరైంది. క్వార్టర్‌ఫైనల్స్‌లో అక్క వీనస్‌ విలియమ్స్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో సెరెనా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. 6-2, 1-6, 6-3తో సెరెనా సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంది. అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన అక్కాచెల్లెల్ల పోరు ఎలాంటి సంచలనం లేకుండా ముగిసింది....

Wednesday, September 9, 2015 - 12:43

యాషెస్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో ఆసీస్ క్రికేటర్లు ఒక్కొక్కరుగా టెస్టు క్రికేట్ కు వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే మైఖేల్ క్లార్క్, షేన్ వాట్సన్ టెస్టు మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రాడ్ హాడిన్ కూడా టెస్టు క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఇకపై సిడ్నీ సిక్సర్స్ తరపున టి -20 మ్యాచ్ లు మాత్రమే ఆడుతానని...

Wednesday, September 9, 2015 - 12:33

హైదరాబాద్ : పోర్చుగల్‌లో ప్రపంచ సెయిలింగ్‌ సిరీస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.పోర్టో వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీకి దిగాయి. హోరాహోరీగా జరిగిన తొలి రౌండ్‌ పోటీల్లో మస్కట్‌ టీమ్‌... టాప్‌ ప్లేస్‌లో నిలిస్తే.... రెడ్‌ బుల్‌ టీమ్‌ ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది.

Monday, September 7, 2015 - 09:53

హైదరాబాద్ : అమెరికన్‌ ఓపెన్‌లో హాట్‌ ఫేవరెట్ల హవా కొనసాగుతోంది. మెన్స్‌ సింగిల్స్‌ ఆరో రోజు పోటీల్లో టాప్‌ సీడ్లకు తిరుగేలేకుండా పోయింది.స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌, బ్రిటన్‌ వండర్‌ యాండీ ముర్రే టైటిల్‌ వేటలో దూసుకుపోతున్నారు.

మూడో రౌండ్‌లో స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌.....

మెన్స్‌ సింగిల్స్‌లో మూడో రౌండ్‌లో...

Monday, September 7, 2015 - 09:48

హైదరాబాద్ : అమెరికన్‌ ఓపెన్‌ ఉమెన్స్‌ డబుల్స్‌లో ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియామీర్జా-మార్టినా హింగిస్‌ జోడీ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో తిమియా బాస్కింజ్కీ,చువాంగ్‌ జోడీతో తలపడ్డ సానియా జోడీకి పోటీనే లేకుండా పోయింది. ఈ టోర్నీలో టాప్‌ సీడ్‌గా, హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగిన హింగిస్‌-సానియా జోడీకి బాస్కింజ్కీ,చువాంగ్‌ అసలే మాత్రం...

Thursday, September 3, 2015 - 18:16

115వ అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో బ్లాక్ థండర్, హాట్ పేవరెట్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. రెండోసీడ్ సిమోనా హాలెప్ సైతం తొలివిజయం నమోదు చేసింది. పురుషుల సింగిల్స్ లో మాజీ నెంబర్ వన్ రోజర్ ఫెదరర్, థామస్ బెర్డిచ్, రిచర్డ్ గాస్కే రెండోరౌండ్ చేరారు.

మహిళల సింగిల్స్ కు గురి పెట్టిన సెరెనా..
అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్...2015...

Thursday, September 3, 2015 - 18:12

అమెరికన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో టాప్ సీడెడ్ స్టార్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ అలవోకగా మూడోరౌండ్ చేరుకొన్నారు. మూడో సీడ్ యాండీ ముర్రే, 5వ సీడ్ వావరింకా తొలి విజయాలు నమోదు చేశారు. మహిళల సింగిల్స్ లో వెస్నినా, క్విటోవా, క్లాడియో పెనెట్టా శుభారంభం చేశారు. యూఎస్ ఓపెన్ మూడ రోజు పోటీల సమయంలో న్యూయార్క్ ఫ్లిండర్స్ పార్క్ నిప్పుల కుంపటిలా మారడంతో టెన్నిస్...

Wednesday, September 2, 2015 - 19:47

ఢిల్లీ : తమతో క్రికేట్ ఆడుతారో ? లేదో చెప్పాలంటూ పాక్ క్రికెట్ బోర్డు బీసీసీకి లేఖ రాసింది. క్రీడలు, రాజకీయాలు, ద్వైపాక్షిక సంబంధాలను వేర్వేరుగా చూడాలని లేఖలో సూచించింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం భారత్ - పాక్ మధ్య డిసెంబర్ లో మూడు వన్డేలు, రెండు టెస్టులను నిర్వహించేందుకు సహకరించాలని బీసీసీఐని కోరింది. తటస్థ వేదికపై భారత్ తో పాటు క్రికెట్ మ్యాచ్ లు...

Tuesday, September 1, 2015 - 16:27

కొలంబో : లంక గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గాలన్న ఇండియా లక్ష్యం నెరవేరింది. సుమారు 22 ఏళ్ల తరువాత కోహ్లీ సేన చిరస్మరణీయ విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు సిరీస్ ను 2-1 తేడాతో విజయం సాధించింది. 1993లో భారత్ టెస్టు సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. సోమవారం ఆటలో రెండో ఇన్నింగ్స్ లో 274 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ లంక ఎదుట 386 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది...

Sunday, August 30, 2015 - 21:39

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టెస్ట్ మూడో రోజుఆటలోనే టీమిండియా ...111 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో మ్యాచ్ పై పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజుఆట కొనసాగించిన టీమిండియా ఇన్నింగ్స్ 312 పరుగులకు ముగిసింది. ఓపెనర్ పూజారా 145 పరుగుల స్కోరుతో నాటౌట్ గా మిగిలాడు. సమాధానంగా తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 201 పరుగులకే ఆలౌటయ్యింది. శ్రీలంక...

Saturday, August 29, 2015 - 17:58

కొలంబో : శ్రీలంక తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. భారత ఓపెనర్ ఛతేశ్వర పుజార శతకం సాధించాడు. ఇతనికి శర్మ ఒక్కడే చక్కటి సహకారం అందించాడు. ఓవర్ నైట్ స్కోర్ 50/2 తో ఆటను ఆరంభించింది. జట్టు స్కోరు 64 వద్ద ఉండగా కోహ్లీ (18) ని మాథ్యూస్ వెనక్కి పంపించాడు. అనంతరం వచ్చిన శర్మ...

Wednesday, August 26, 2015 - 18:18

హైదరాబాద్ : వార్షిక ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ రేస్ కోసం నిర్వాహక హైదరాబాద్ రన్నర్స్ సొసైటి విస్త్రుత ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 30 న జరిగే ఈ మారథాన్ రేస్ లో దేశంలోని విఖ్యాత రన్నర్లతో సహా మొత్తం 14వేల మంది పాల్గొంటారని నిర్వాహక సంఘం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకటించింది. హైదరాబాద్ నగరానికే ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ రేస్ ను భారతి ఎయిర్ టెల్...

Wednesday, August 26, 2015 - 18:15

జమైకన్‌ స్ప్రింట్ క్వీన్ షెల్లీ యాన్‌ ఫ్రేసర్‌ ప్రైస్‌...మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ 100 మీటర్ల స్ప్రింట్‌ ఫైనల్‌లో షెల్లీకి మరోసారి పోటీనే లేకుండా పోయింది. కెరీర్‌లో 5వ వరల్డ్ చాంపియన్‌షిప్‌ గోల్డ్ మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. 

బీజింగ్ లో పోటీలు..
బీజింగ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్‌...

Wednesday, August 26, 2015 - 18:07

ఢిల్లీ : భారత మహిళా టెన్నిస్ డబుల్స్ క్వీన్ సానియా మీర్జాకు...కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న' పురస్కారం పై కర్నాటక హైకోర్ట్ స్టే విధించింది. తనకు దక్కాల్సిన ఖేల్ రత్న అవార్డును సానియాకు ఇవ్వడం అన్యాయమంటూ కర్నాటకకు చెందిన పారా ఒలింపిక్ అథ్లెట్ గిరీషా నాగరాజే గౌడ కోర్టు కెక్కాడు. 2012 లండన్ పారా ఒలింపిక్స్ పురుషుల హైజంప్ లో గిరీషా రజత...

Monday, August 24, 2015 - 17:55

పాట్నా : ప్రో కబడ్డీ లీగ్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన తెలుగు టైటాన్స్‌ జట్టు థర్డ్‌ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. పాట్నా పైరేట్స్‌తో ముగిసిన ఆఖరాటలో సునాయాస విజయం సాధించింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరీ చెలరేగడంతో టైటాన్స్ జట్టుకు పోటీనే లేకుండాపోయింది. ప్రో కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌లో పటిష్టమైన తెలుగు టైటాన్స్‌ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మూడు,...

Monday, August 24, 2015 - 17:51

పాట్నా : ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్‌ టైటిల్‌ను యూ ముంబా జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్‌లో పటిష్టమైన బెంగళూర్‌ బుల్స్‌ జట్టును చిత్తు చేసి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. గత సీజన్‌లో ఫైనల్‌ వరకూ వచ్చి చేతులెత్తేసిన ముంబై జట్టు.... రెండో సీజన్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా అదరగొట్టి విజేతగా నిలిచింది.

లీగ్ దశలో 12 విజయాలు..
ధూమ్‌ ధామ్‌...

Pages

Don't Miss