Sports

Tuesday, August 21, 2018 - 07:55

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో చేజార్చుకున్న సెంచరీని రెండో ఇన్నింగ్స్‌లో సాధించి తన సత్తా సాధించుకున్నాడు. 191 బంతుల్లో 10 ఫోర్లతో టెస్టుల్లో 23వ సెంచరీ సాధించాడు. అనంతరం 103 పరుగుల వద్ద క్రిస్‌ వోక్స్‌...

Sunday, August 19, 2018 - 22:01

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది.  రెజ్లింగ్‌ 65 కేజీల పురుషుల విభాగంలో భజరంగ్‌ పునియా సత్తాచాటి భారత్‌కు పసిడి పతకం అందించాడు. జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు. అంతకు ముందు సెమీస్‌లో మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో అద్భుత విజయం సాధించాడు. పురుషుల రెజ్లింగ్‌...

Saturday, August 18, 2018 - 21:20

ఇండోనేషియా : జకర్తా వేదికగా ఏసియాడ్‌ గేమ్స్‌ ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడా సమరానికి ఇండోనేషియా రెండోసారి ఆతిథ్యమిస్తోంది. 16 రోజుల పాటు ఈ మెగా క్రీడా సంబరాలు జరగనున్నాయి. మొత్తం 45 దేశాల నుండి 11వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో బరిలోకి దిగనుంది భారత్‌. టాప్‌-5 స్థానమే...

Saturday, August 18, 2018 - 19:52

ఇండోనేషియా : జకర్తా వేదికగా 18వ ఏసియాడ్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఇండోనేషియా రెండోసారి ఏసియాడ్ గేమ్స్ కు అతిథ్యమిస్తోంది. 16 రోజులు పాటు ఏసియాడ్ గేమ్స్ జరుగనున్నాయి. 45 దేశాల నుండి 11 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో భారత్ బరిలోకి దిగనుంది. భారత్ 5వ స్థానం లక్ష్యంగా పెట్టుకుంది.

Thursday, August 16, 2018 - 12:49

సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెటర్ దిగ్గజాల్లో ఒకరు. కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ లో అడుగు పెట్టి సెంచరీల రారాజుగా పేరు తెచ్చుకుని మాస్టర్ బ్లాస్టర్ గా పేరొందాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ లో రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ లో 18 సంవత్సరాల అర్జున్ టెండూల్కర్ హల్ చల్ చేశాడు. ఎంసీసీ యంగ్...

Thursday, August 16, 2018 - 09:05

ఢిల్లీ : భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌ , చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ అయిన అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను గెలవడం ఆయనకు మంచి...

Monday, August 13, 2018 - 09:12

లండన్ : క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో విజయం సాధించాలనుకున్న కోహ్లీసేన పరాజయంపాలైంది. 159 పరుగుల ఇన్సింగ్స్‌ తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్‌  2-0తో  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాట్స్‌మెన్స్‌ వైఫల్యం కారణంగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో మిగతా మూడు టెస్టులను గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది.. రెండో...

Sunday, August 12, 2018 - 15:18

హైదరాబాద్ : ప్రముఖ షట్లర్ పీవీ సింధు ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మహంకాళీ అమ్మవారికి మారు బోనం సమర్పించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం సింధు మీడియాతో మాట్లాడారు. బోనాల పండుగకు రాలేదని..మ్యాచ్ కారణంగా రాలేకపోయానన్నారు. ఏషియన్ గేమ్స్ లో బాగా ఆడాలని కోరుకున్నట్లు, అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ...

Sunday, August 12, 2018 - 14:44

ఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ త్వరలో బీసీసీఐ ప్రెసిడెంట్‌ కానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించటంతో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాల పరిమితి కారణంగా బోర్డులోని సీనియర్లు ప్రెసిడెంట్‌ పదవికి దూరం కానున్నారు. దీంతో వీరంతా గంగూలీపై దృష్టిపెట్టారు.

ఒకప్పటి టీమిండియా...

Sunday, August 5, 2018 - 16:30

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లో పీవీ సింధు పోరాడి ఓడింది. 21..19, 21..10 తేడాతో పీవీ సింధుపై కరోలినా మారిన్‌ విజయం సాధించింది. సింధు వరుసగా రెండోసారీ రజత పతకానికే పరిమితమైంది. కరోలినాతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో  ఐదు మ్యాచ్‌ల్లో సింధు విజయం సాధించింది. 

 

Sunday, July 22, 2018 - 21:24

ఢిల్లీ : ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం లక్ష్య సేన్‌ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో జరిగిన ఫైనల్‌ పోరులో లక్ష్యసేన్‌ 21-19, 21-18 తేడాతో థాయ్‌లాండ్‌ ఆటగాడు కున్‌లవుత్‌ పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచాడు. 46 నిమిషాల పాటు జరిగిన పోరులో లక్ష్యసేన్‌.. కున్‌లవుత్‌ను మట్టికరిపించి 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు...

Saturday, July 21, 2018 - 11:50

శ్రీలంక : యునెస్కో గుర్తింపు కావాలో..ప్రఖ్యాతి చెందిన క్రికెట్ స్టేడియం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యునెస్కో వివిధ అవార్డులను, బహుమతులను, శాస్త్ర, సాంస్కృతిక, శాంతి రంగాలలో ప్రధానం చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వివిధ కట్టడాలకు యునెస్కో గుర్తింపునిస్తుంది. ఈ...

Wednesday, July 18, 2018 - 07:34

ఇంగ్లండ్ : సొంతగడ్డలో భారత్‌పై టీ20 సిరీస్‌ పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటలేకపోయిన ఆ జట్టు... వన్డే సిరీస్‌ను గెలుచుకుని పరువు దక్కించుకుంది. నిన్న హెడింగ్లే వేదికగా భారత్‌తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో గెల్చుకుని...

Monday, July 16, 2018 - 09:48

ఢిల్లీ : 2018 ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ప్రభంజనం సృష్టించింది. ఫైనల్స్‌కు చేరిన అతి చిన్న దేశం క్రొయేషియాపై ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించింది. మాస్కో లూజ్నికీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి..20 సంవత్సరాల తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 18 నిమిషం వద్ద ఫ్రాన్స్‌...

Sunday, July 15, 2018 - 09:40

ఢిల్లీ : వింబుల్డన్‌లో సంచలనం చోటు చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్‌కు షాక్‌ తగిలింది. జర్మనీకి చెందిన  ఏంజెలికా కెర్బర్‌ చేతిలో సెరెనా ఓటమిపాలైంది. ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ మ్యాచ్‌లో కెర్బర్‌ అద్భుత విజయం సాధించింది. ఆరంభం ఉంచే ఈ మ్యాచ్‌లో కెర్బర్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది....

Sunday, July 15, 2018 - 09:27

ఢిల్లీ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ చిత్తుగా ఓడింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 323 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో భారత క్రికెటర్లు ఘోరంగా విఫలం అయ్యారు.  మొదటి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్దేశిత 50 ఓవర్లలో 322 పరుగులు చేసింది.  323 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ...

Friday, July 13, 2018 - 11:36

ఇంగ్లండ్ : ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 40.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 137 పరుగులు చేసి భారత్‌ను సునాయాసంగా గెలిపించాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 75 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. శిఖర్‌ ధావన్‌ 40...

Thursday, July 12, 2018 - 07:44

ఢిల్లీ : ఫిఫా 2018 పుట్‌బాల్‌లో అద్భుతమైన ఆటతీరుతో  తన సత్తా చాటింది క్రొయేషియా. 1966 తర్వాత రెండో సారి ఫైనల్‌కు చేరుకోవాలన్న ఇంగ్లాండ్‌ తపనను  క్రొయేషియా నీరుగార్చింది.లుజ్నికీ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో  విజయం సాధించి  ఫైనల్‌కు చేరింది.   అంచనాలు లేకుండా సాగిన పోరులో క్రొయేషియా విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభమైన 5...

Wednesday, July 11, 2018 - 08:08

ఢిల్లీ : ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు ఫ్రాన్స్‌ దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆ జట్టు 1..0 తేడాతో బెల్జియాన్ని మట్టికరిపించింది. దీంతో సంచలన విజయాలతో ఫుట్‌బాల్‌ సెమీస్‌కు దూసుకొచ్చిన బెల్జియం ఫైనల్‌ ఆశలకు గండి పడింది. కీలకమైన పోరులో బలమైన ఫ్రాన్స్‌ ఆ జట్టును  సెమీస్‌లో చిత్తు చేసింది. మెగా టైటిల్‌ ముద్దాడాలన్న బెల్జియం దూకుడుకు అడ్డుకట్ట వేసింది. గడిచిన 12 ఏళ్లలో...

Tuesday, July 10, 2018 - 12:33

ఢిల్లీ : ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌, బెల్జియం జట్ల మధ్య జరిగే ఫుట్‌బాల్‌ తొలి సెమీఫైనల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లు నిండి ఉండడంతో ఈ మ్యాచ్‌ హోరా హోరీగా  జరగనుంది. 23 మ్యాచ్‌లలో పరాజయమన్నదే ఎరుగని బెల్జియం క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించింది. దీంతో ప్రపంచకప్ హాట్‌ ఫేవరెట్ ముద్ర వేసుకొని సెమీస్‌లో...

Monday, July 9, 2018 - 07:04

ఢిల్లీ : మూడో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. మన క్రికెటర్లు అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లండ్‌ క్రికెటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తైంది. దీంతో 2-1 తేడాతో టీ 20 సిరీస్‌ను ఇండియా గెల్చుకుంది. రోహిత్ శర్మ, హార్థిక్ అద్భుతమైన ఆటతీరుతో భారత్‌కు విజయం తెచ్చిపెట్టారు. ఇంగ్లండ్ క్రికెటర్లను మనవాళ్ళు ముచ్చెమటలు...

Saturday, July 7, 2018 - 21:58

ప్రపంచ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఆసక్తికరంగా మారింది. గతంతో పోలిస్తే ఫుట్ బాల్ మ్యాచ్ లకు క్రేజ్ పెరిగింది. వరల్డ్ కప్ లో ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లాండ్ లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. జర్మనీ, అర్జెంటీనా, ఉరుగ్వే సెమీఫైనల్ కు చేరుకోలేకపోయాయి. ఇదే అంశంపై ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ప్లేయిర్, తెలంగాణ రాష్ట్ర ఫుట్ బాల్ సెక్రటరీ పాల్గుణ విశ్లేషణ అందించారు. పూర్తి వివరాలను వీడియోలో...

Monday, June 25, 2018 - 09:09

ఢిల్లీ : ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ అదరగొడుతోంది. గ్రూప్‌-జిలో పనామాతో జరిగిన మ్యాచ్‌లో 6-1తో ఇంగ్లీష్‌టీమ్‌ ఘనవిజయం సాధించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కెప్టెన్‌ కేన్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించడంతో పనామా జట్టు చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్‌ 22వ నిముషంతోపాటు, 45, 62వ నిముషంలో కేన్‌ గోల్స్‌తో స్టేడియం...

Monday, June 25, 2018 - 09:08

ఢిల్లీ : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో 2-1 గోల్స్‌ తేడాతో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాపై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్‌లో ఆరంభం నుంచి కెప్టెన్ శ్రేజేశ్ సారథ్యంలోని భారత్ జట్టు దూసుకుపోతోంది. 17వ నిమిషంలో హర్మన్...

Sunday, June 24, 2018 - 07:02

ఢిల్లీ : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. టోర్నీ ఏదైనా.. ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే ఆధిపత్యం భారత్‌దేనని మరోసారి రుజువైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆద్యంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించింది. మన్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. దిల్‌ప్రీత్ సింగ్,...

Saturday, June 23, 2018 - 11:28

హైదరాబాద్ : జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారిణి రుచిక తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సదరు మహిళతో తన భర్త చేసిన సెల్‌ఫోన్‌ చాటింగ్‌ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సదరు యువతితో తన భర్త జరిపిన సెల్‌ఫోన్‌ చాటింగ్‌ వివరాలను ఆమె...

Pages

Don't Miss