జియో దూకుడుకు ఎయిర్ టెల్ బ్రేక్

Submitted on 16 January 2019
Speed Reliance Jeo Network, But A Same Time Increased Airtel Network Speed

ఢిల్లీ: ప్రముఖ రిలయన్స్ నెట్ వర్క్ జియో దూకుడుకి ఎయిర్ టెల్ బ్రేక్ వేసింది. రిలయన్స్ జియో డౌన్ లోడ్ స్పీడ్ తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. రిలయన్స్‌ జియో 4జీలో గత నెల డేటా డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఎనిమిది శాతం తగ్గి 18.7 మెగాబైట్‌ పర్‌ సెకండ్‌(ఎంబీపీఎస్‌)గా నమోదైందని ట్రాయ్‌ తెలిపింది. ఈ క్రమంలో ఎయిర్ టెల్ 4జీ నెట్‌వర్క్‌ స్పీడందుకుంది. జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ తగ్గినా..టెలికాం నెట్‌వర్క్‌లలో జియోదే టాప్‌ అనీ..గత ఏడాదిగా అంటే 2018లో 12నెలల్లోనూ జియోనే అగ్ర స్థానంలో ఉందని తెలిపింది. 2018 నవంబర్  నెలలో జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 20.3ఎంబీపీఎస్‌గా ఉండగా, డిసెంబర్‌లో అది 18.7 ఎంబీపీఎస్‌కు పడిపోయింది.

ఈ క్రమంలో భారతీ ఎయిర్‌టెల్‌ 4జీ నెట్‌వర్క్‌ వేగం పెరిగి..2018 నవంబర్ లో 9.7ఎంబీపీఎస్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌ నెట్‌ స్పీడ్..డిసెంబర్ కల్లా 9.8ఎంబీపీఎస్‌గా పెరిగినట్లు  మై స్పీడ్‌ పోర్టల్‌లో ట్రాయ్‌ తెలిపింది. అదే విధంగా వొడాఫోన్‌-ఐడియా విలీనం తర్వాత వొడాఫోన్‌ ఐడియా పేరుతో నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో వొడాఫోన్ డౌన్‌లోడ్‌ వేగం 6.8ఎంబీపీఎస్‌ నుంచి 6.3ఎంబీపీఎస్‌కు పడిపోయింది. ఐడియా కూడా 6.2ఎంబీపీఎస్‌ నుంచి 6 ఎంబీపీఎస్‌కు తగ్గిందని ట్రాయ్‌ పేర్కొంది. ఇక అప్‌లోడ్‌ స్పీడ్‌లోనూ స్లోనెస్ నమోదులో  ఐడియా టాప్‌లోనే ఉండటం గమనార్హం. ఐడియా అప్‌లోడ్‌ స్పీడ్ 2018 నవంబర్ లో 6.6ఎంబీపీఎస్‌గా ఉండగా, గతనెలలో అది 5.3ఎంబీపీఎస్‌కు తగ్గిపోయింది. 

ఆ తర్వాతీ స్థానంలో వొడాఫోన్‌ 5.1ఎంబీపీఎస్‌, జియో 4.3ఎంబీపీఎస్‌, ఎయిర్‌టెల్‌ 3.9ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ స్పీడ్‌ను నమోదు చేసినట్లు ట్రాయ్‌ తెలిపింది. వీడియోలు చూసేందుకు, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌కు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ చాలా ముఖ్యం కాగా, ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేయాలంటే అప్‌లోడ్‌ స్పీడ్‌ కీలకం. 

 

Delhi
Reliance
Geo
network
Speed
Airtel
Troy
Idea

మరిన్ని వార్తలు