Specials

Tuesday, July 14, 2015 - 11:22

ఎవరు ఏం తినాలో నిర్ధేషిస్తున్నారు. ఏ విశ్వాసాలు ఉన్నతమో వారే నిర్వచిస్తున్నారు. ప్రజలంతా తమ ఆలోచనలకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో బయటకు చెప్పని అజెండా అంతర్లీనంగా ఉందా ? ఒకరు మదర్సాలను క్రమబద్దీకరిస్తామని పేర్కొంటారు. మరొకరు తినే తిండిపై నియంత్రణ విధించాలని అంటారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందనే దానిపై ప్రత్యేక కథనం..

Tuesday, July 14, 2015 - 10:25

మహిళల సమస్యలపై తక్షణ స్పందన..ఉద్యమాల్లో ప్రత్యేక గొంతుక..ఆపదలో ఉన్న మహిళలకు భరోసా..బాధిత మహిళలకు ఆలంబన..ఒక రచయిత్రి..ఒక జర్నలిస్టు..ఒక స్త్రీ వాది..స్వశక్తిని నమ్మే మహిళ ప్రత్యేక కథనం..

Sunday, July 12, 2015 - 12:58

సాహిత్యం నేపథ్యంగా ఉన్న వారి జీవితాల్లో విలువలుంటాయి. వెలుగులుంటాయి. జాలి, ప్రేమ, కరుణలు జాలు వారుతుంటాయి. సృజన కారుల కళ్లల్లో మానవత్వం తొనికిసలాడుతుంటుంది. సమ సమాజం కోసం ఎందరో కవులు..రచయితలు కలలు కన్నారు. కలాలు ఝులిపించారు. సృజన స్వరాలై గర్జించారు. తమ ధిక్కార స్వరాలు వినిపించారు. అలాంటి వారిలో డా.రావి రంగారావు ఒకరు.
'నీ కన్నుల వృషభాలు వాలు చూపుల నాగలి కట్టి నా...

Sunday, July 12, 2015 - 12:49

మట్టి నరాలు తెగిన చోట పచ్చదనం శ్వాసించదంటూ ప్రపంచీకరణ ఇంద్రజలాన్ని కవిత్వంతో ఇంద్రజాలంగా మార్చిన యువ కవితా కెరటం గవిడి శ్రీనివాస్. మానసిక నేత్రంతో ప్రపంచాన్ని వీక్షించి చీకట్లో వెలుగుతున్న ఆత్మను కవిత్వంగా ఆవిష్కరించిన అనుభూతి కవి. గవిడి శ్రీనివాస్ పరిచయ కథనం..

Sunday, July 12, 2015 - 12:43

బాల్యం ఎగిరి గంతులేస్తుంది. యవ్వనం గంభీరంగా రంకెలేస్తుంది. వృద్దాప్యం మౌనంగా ఘోషిస్తుందని అంటారో ఓ కవి. కానీ తెలంగాణ కళాకారుడు మాత్రం ఈమూడు దశల్లోనూ పాటై పల్లవిస్తాడు. భావమై పరిమళిస్తాడు. కాళ్ల గజ్జెలు ఘల్లుమనేలా వేదికపై కదం తొక్కుతాడు. కరుణ..వీర..రౌద్ర రసాలను ఏకకాలంలో పోషిస్తాడు. మానత్వం సజీవంగా ఉందని చాటి చెబుతాడు. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రజా వాగ్గేయకారుడే బయ్యారం...

Saturday, July 11, 2015 - 13:38

ప్రత్యేక సందర్భాలలో ఇంటిని నచ్చిన విధంగా అలకరించుకోవడానికి ఎంతో మంది ఆసక్తి కనబరుస్తారు. అలాంటి వారి కోసం మానవి 'సొగసు' లో కొత్త రకమైన ముగ్గుల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, July 8, 2015 - 08:02

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ప్రసుత్త పరిణామాలపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కామెంట్లలో స్పష్టత లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు 'న్యూస్ మార్నింగ్' చర్చలో అన్నారు. తెలంగాణ లో టిడిపి ని లేకుండా చేయాలని టిఆర్ ఎస్ చూస్తోందా? టిఆర్ ఎస్ కుట్రలో భాగంగానే సండ్ర, రేవంత్ లు అరెస్టు అయ్యారా? ఓటుకు నోటు కేసు బలహీనమౌతోందా? కేసీఆర్ తో పవన్...

Tuesday, July 7, 2015 - 19:41

ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత - చేవెళ్ల రగడ సృష్టిస్తోంది. డిజైన్ మార్పు నిర్ణయంపై సెగలు రేగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.4,489 కోట్ల పనులు వృథాయేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. కాళేశ్వరంలో నిర్మిస్తే 90 మీటర్ల ఎత్తులో వాటర్ ఫ్లో జరగనుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. తుమ్మిడి హెట్టి వద్ద నిర్మిస్తే 150 మీటర్ల ఎత్తులో వాటర్ ఫ్లో జరుగనుందని, విద్యుత్ ఉత్పత్తికి అవకాశం...

Sunday, July 5, 2015 - 12:56

'చిత్తజల్లు వరహాలరావు' ఒక సాంఘీక విప్లవకారుడే కాదు. సాంస్కృతిక రథసారధి. నిజాలను నిగ్గు తేల్చిన నిత్య పరిశోధకుడు. శ్రీశ్రీ కవిత్వం యువతరం గుండెలను ఎలా ఉర్రూతలూగించిందో 'సివి' రచనలు విద్యార్థి, యువజనుల లోకపు మస్తిష్కాలకు పట్టిన ఛాందస భావాల దుమ్ము దులిపింది. వారిని అభ్యుదయం వైపు నడిపించింది. శాస్త్రీయ విజ్ఞానం ప్రజల్లో పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం అంటే అందులో...

Sunday, July 5, 2015 - 12:43

'అక్షరం' లక్ష మెదళ్ల కదలిక అని కాళోజీ నారాయణ రావు అన్నారు. ఈ మాట అక్షరాల సాంస్కృతిక విప్లవకారుడు 'చిత్తజల్లు వరహాలరావు'కు వర్తిస్తుంది. 'సివి'గా ప్రసిద్ధి పొందిన వరహాల రావు అభ్యుదయ భావాలతో 'సత్యకామ', 'జాబాలి' లాంటి ఎన్నో గ్రంధాలు రాశారు. కులమత ఛాందస భావాలను తన రచనలో దుయ్యబట్టారు. ఆయన సమగ్ర రచనల సంకలాలను 'ప్రజాశక్తి' బుక్ హౌస్ వెలుగులోకి తెచ్చింది. ఇటీవల విజయవాడలో 'సివి...

Saturday, July 4, 2015 - 07:57

రేవంత్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో తెలంగాణ ఎసిబికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు వ్యవహారంలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయసింహలకు ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎసిబి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏ ప్రతిపాదికపై రేవంత్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతున్నారని ఎసిబిని కోర్టు ప్రశ్నించింది. రేవంత్‌రెడ్డికి...

Friday, July 3, 2015 - 19:44

హైదరాబాద్: పేదలకు రాయితీల కోత విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ బిల్లులను ఆమోదించే ఎంపీలపై ప్రేమ మాత్రం టన్నుల కొద్దీ ప్రేమ కురిపిస్తోంది. పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ రేట్లకు ఆహార పదార్థాలు సరఫరా చేయడమే కాదు...ఇప్పుడు వారి జీతాన్ని డబుల్ చేయాలని భావిస్తోంది. శాలరీలు, పెన్షన్లతో పాటు అనేక సదుపాయాలు ఎంపీలకు కల్పించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసులు చేసింది...

Friday, July 3, 2015 - 19:43

పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, వసతుల పెంపుపై ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో జాయింట్ కమిటి వేసింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని నెలల నుంచి దీనిపై కసరత్తు చేస్తున్న కమిటీ దాదాపు 65 ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందుంచినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిపాదనల్లో ఎంపీల జీతం డబుల్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. పెన్షన్ కూడా భారీగా పెంచాలని, విమానం, రైల్వే...

Friday, July 3, 2015 - 18:32

కర్నూలు:వైసీపీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే తమ విధులకు అడ్డుతగిలారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన భూమాను త్రీటౌన్ పీఎస్ కు తరలించారు. ఆయనపై 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యింది. భూమా...

Friday, July 3, 2015 - 17:37

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో...ముందునుండి అన్ని విషయాలు తెలిసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలిసారిగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ అవన్నీ ప్రస్తావించదలుచుకోలేదంటూనే కొన్ని కీలక వాఖ్యలు చేశారు. ప్రజల కోరిక మేరకు కల సాకారమైందని, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ గా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఇక ప్రజలంతా దేశ అభివద్ధి కోసం కలిసి...

Friday, July 3, 2015 - 17:34

హైదరాబాద్:తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ కొనసాగుతునే ఉంది. ఎన్ని సీట్లు ఉంటాయో.. ఎన్ని కాలేజీలు రద్దు అవుతాయోననే అయోమయం నెలకొంది. 25 కాలేజీలను రద్దు చేసిన జెఎన్టీయూ.. సుమారు..40 వేల సీట్లకు కోత విధించింది. వసతులు లేని కాలేజీలకు కొన్ని కోర్స్ లను పూర్తిగా రద్దు చేసింది...

Friday, July 3, 2015 - 17:30

హైదరాబాద్: నిన్నటి దాకా ఏపీ తమ్ముళ్లంతా టార్గెట్ చేశారు. ఆయన పద్దతి బాలేదని పబ్లిక్‌లోనే ఫైరయ్యారు. పక్షపాత వైఖరిని మానుకోవాలని ఘాటుగా విమర్శించారు. ఇరురాష్ట్రాలను సమానంగా చూడాలని మండిపడ్డారు. ఇపుడు తాజాగా ఓ తెలంగాణ నేత గవర్నర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడలేకపోతే... పదవి నుంచి తప్పుకోండని పరోక్షంగా ఓ లేఖను సంధించారు...

Friday, July 3, 2015 - 17:03

హైదరాబాద్: నెలల పసికందు నుండి పండు ముదుసలి వరకు కామాంధుల ఆగడాలకు బలవుతున్నారు. అయిన వారే చిన్నారులపై తెగబడుతున్నారు. ఈ స్థితి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? పిల్లలను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి నిర్భయలో డాక్టర్ సుధ సైక్రియాటిస్టు తెలియజేశారు. ఆ వివరాలను ఈ వీడియోను క్లిక్ చేయండి...

Friday, July 3, 2015 - 17:00

హైదరాబాద్:ఆడపిల్లలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు, జీన్స్ ధరించకూడదు, సోషల్ మీడియా వినియోగించకూడదంటూ రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లాలోని గ్రామపంచాయితీ విధించిన ఆంక్షలను ఖండిస్తూ మహిళల ప్రియనేస్తం మానవికి స్వాగతం పలుకుతున్నాం.
అత్యాచార కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు.....
అత్యాచార కేసులకు సంబంధించి...

Friday, July 3, 2015 - 16:57

హైదరాబాద్: ఫ్యాషన్ ను ఫాలో అవటంలో టీనేజర్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త దనాన్నీ కోరుకుంటారు. అలాంటి టీనేజర్స్ కోసం లాంగ్ ఫ్రాక్స్ తో ఇవాళ్టి సొగసు నారాయణ గూడలోని సనా క్రేజీ ఫ్యాషన్స్ మీ ముందుకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

Friday, July 3, 2015 - 16:39

హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం... సర్వే బృందం భూ పరిశీలనకు వచ్చింది. వారిని బాధిత గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కొయ్యపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. పక్కనే ఉన్న మహిళలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తమ భూముల్లోకి రావద్దంటూ అధికారులను అక్కడి...

Friday, July 3, 2015 - 16:38

హైదరాబాద్: పోలీసులకు వారాంతపు సెలవులు అందని ద్రాక్షగానే మిగిలింది. రోజుకు గంటల తరబడి విధులు నిర్వహించే పోలీసులకు.. ఒక్కరోజైనా సెలవు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీక్లీ ఆఫ్‌ కావాలని దశాబ్ధాల తరబడి అడుగుతున్నా.. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తామని తెలంగాణ సర్కార్‌ హామీ ఇచ్చి ఏడాది గడిచినా.. అది ఇంకా అమలుకు నోచుకోలేదు.
...

Friday, July 3, 2015 - 11:53

సిటీలు పెరుగుతున్నా పార్కులు పెరగడం లేదు. సమాజానికీ, ప్రకృతికీ ఎంతో మేలు చేసే పార్కుల విషయంలో ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పార్కులకు కేటాయించిన భూములు కబ్జా అవుతున్నా అధికారులు నిద్ర నటిస్తున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పార్కుల నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే ఫలితాలు దారుణంగా వుంటాయి.                                                          ...

Friday, July 3, 2015 - 11:38

జేఈఈ ర్యాంకుల విషయంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జేఈఈ ర్యాంకులు ప్రకటించడంలో ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వారిని ఉద్యోగాల నుంచి భర్తరఫ్ చేయాలని చెప్పారు. విద్యారంగంలోని వ్యవస్థను...

Friday, July 3, 2015 - 10:51

చర్లపల్లి జైలు నుంచి విడుదలైనప్పుడు జైత్రయాత్రలో రేవంత్ రెడ్డి చేసిన సరైనవి కావని వక్తలు తెలిపారు.ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిఆర్ ఎస్ నేత.. రాకేష్ , టిడిపి నేత సతీష్ మాదిగ, మాజీ ఎమ్మెల్సీ కె.లక్ష్మణ్ రావు మాట్లాడారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన రేవంత్ నిర్దోషి కాదని చెప్పారు. అవినీతికి బ్రేక్ వేయాల్సిన అవసరముందన్నారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

...
Friday, July 3, 2015 - 09:39

పార్కుల కబ్జా వెనుక రాజకీయనేతల హస్తముందని ఫ్యాకా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఇరు రాష్ట్రాల్లో పార్కుల నిర్వహణలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. పార్కులను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. 'ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్కుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పార్క్‌లు కబ్జా అవుతున్నా అధికారగణం చోద్యం చూస్తోంది...

Thursday, July 2, 2015 - 19:36

హైదరాబాద్:నిజాం నిరంకుశత్వంపై బిగిసిన పిడికిలి.. ఇప్పుడు చేయి చాస్తోంది..! రజాకార్లపై నిప్పులు కురిపించిన కళ్లు.. నేడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి..! దౌర్జన్యంపై గళమెత్తిన స్వరం ఆవేదనతో మూగబోతుంటే.., దుర్మార్గాలను ప్రతిఘటించిన గుండె ధైర్యం కోల్పోతోంది..! పోరాటం ఫలించినా, ప్రతిఫలం మాత్రం దక్కలేదు..! జీవితాన్ని ధారపోసినా, ఆధారం మాత్రం లభించలేదు..! నాడు నిజాం...

Pages

Don't Miss