• Sharebar
>>
10 టివి ఫీచర్స్
>>

హెచ్ పీ వాయిస్ ట్యాబ్లెట్స్....

19:09 - February 22, 2014
 
00:00

హ్యూలెట్ - ప్యాకార్డ్ కంపెనీ ఇండియన్ మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేసిన ట్యాబ్లెట్స్ లో రెండు వాయిస్ కాలింగ్ ట్యాబ్స్ ఉన్నాయి. స్లేట్ 6 అండ్ స్లేట్ 7 మోడల్ నేమ్ తో లభిస్తున్న ఈ రెండింటిని ట్యాబ్స్ అనడం కంటే ఫ్యాబ్లెట్స్ అనడం మంచిది. అంటే ఇవి ఫోన్ కి ఎక్కువగా ట్యాబ్ కి తక్కువగా ఉంటాయన్నమాట. ఈ రెండు ట్యాబ్లెట్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి. ఈ రెండూ డ్యుయల్ సిమ్ సపోర్ట్ ఫీచర్, డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్ కలిగి ఉన్నాయి. 5 మెగా పిక్సెల్స్ రియార్ అండ్ 2 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలున్నాయి. స్లేట్ 7లో మాత్రం ఎల్ ఈడీ ఫ్లాష్ లేదు. స్లేట్ 6.. సిక్స్ ఇంచ్ డిస్ ప్లే.. 1280 బై 720 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగి ఉంటుంది. 7 ఇంచ్ డిస్ ప్లే 1280 బై 820 పిక్సెల్ రెజల్యూషన్ తో స్లేట్ సెవన్ ఉంటుంది. స్లేట్ 6 ధర 23,700 రూపాయాలు అయితే స్లేట్ 7 ధర 17,300 రూపాయలు.
హెచ్ పీ ఓమ్నీ 10..
      
స్లేట్ ట్యాబ్ తో పాటు హెచ్ పీ ఓమ్నీ 10 పేరుతో మరో ట్యాబ్ ని కూడా లాంచ్ చేసింది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ ట్యాబ్ 1920 బై 1200 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇంటెల్ బే ట్రయల్ ప్రాసెసర్ తో పనిచే ఓమ్నీ 10లో 2జీబీ ర్యామ్ 64జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
యూత్ కోసం 3 నోట్ బుక్స్..
         
యూత్ ని టార్గెట్ చేస్తూ హెచ్ పీ 3 నోట్ బుక్ లను డిజైన్ చేసింది. వీటిలో హెచ్ పీ ఎన్వీ 17 లీప్ మోషన్ స్పెషల్ ఎడిషన్ (ఎస్ఈ) ధర 1.18 లక్షలు. హెచ్ పీ పెవిలియన్ 15 టచ్ స్మార్ట్ నోట్ బుక్ కాస్ట్ 51,825 రూపీస్. హెచ్ పీ 15 నోట్ బుక్ కాస్ట్ 29,995 రూపీస్. ఆల్ట్రా మోడ్రన్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ బ్యాటరీ, మల్టీ టాస్కింగ్, హై స్పీడ్ లాంటి ఫీచర్స్ ఈ డివైస్ లలో ఉన్నాయి.
స్యామ్ సంగ్ గెలాక్సీ మరో 2 ట్యాబ్లెట్స్..
       
స్యామ్ సంగ్ గెలాక్సీ సిరీస్ లో మరో 2 ట్యాబ్లెట్స్ లను ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. వీటిల్లో ఒకటి గెలాక్సీ ట్యాబ్ 3 నియో. దీన్నే గెలాక్సీ ట్యాబ్ 3 లైట్ పేరుతో మన మార్కెట్లోనూ విడుదల చేశారు. 7 ఇంచ్ స్ర్కీన్ సైజ్, 1024 బై 600 పిక్సెల్స్ రెజల్యూషన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1.2 గిగా హెడ్జ్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఇందులో వాడారు. ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ 4.2 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ ట్యాబ్ లో 2 ఎంపీ కెమెరా మాత్రమే ఉంటుంది. దీని ధర 16,490 రూపాయాలు.
గెలాక్సీ నోట్ ప్రో 12.2..
      
స్యామ్ సంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ పేరుతో 12.2 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో హై ఎండ్ ట్యాబ్లెట్ ను త్వరలో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. 2560 బై 1600 పిక్సెల్స్ రెజల్యూషన్ దీని స్పెషాలిటీ. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ ట్యాబ్ లో 64 జీబీ ఇన్ బిల్ట్ మెమరీ ఉంటుంది. ఈ ట్యాబ్ తో పాటు ఎస్ పెన్ ని కూడా అందిస్తున్నారు. దీని ధర 64,900 రూపాయలు.
ఇన్నోవేటివ్ హియర్ ఫోన్స్..
      
ఒక పక్షి ప్రయాణం ఈ గేమ్. ప్రపంచమంతా ఎగరాలనుకునే ఈ డ్రీమ్ బర్డ్ రోల్ మీరు ప్లే చేయొచ్చు. లొకేషన్స్ అన్నీ థియెట్రికల్ సీన్స్ లా ఉంటాయి. మీ ఎనర్జీ వేస్ట్ కాకుండా ఎలా ఎగరాలో నేర్చుకోవడమే ఈ గేమ్. ఈ ఎనర్జీని పొందేలా హెల్ప్ చేసేందుకు మీకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఎదురవుతూ ఉంటారు. వన్ బటన్ గేమ్ ప్లే ఈ గేమ్ స్పెషాలిటీ. దీని వల్ల గేమ్ లో రియల్ స్కిల్ ఫుల్ పొందడం సులువు. డిఫరెంట్ సీన్స్, వెరైటీ లెవెల్స్, యూనిక్ లుక్ అండ్ యాంబియన్స్ మీకు విజ్యువల్లీ థ్రిల్ ఇస్తాయి. పేపర్ థియేటర్ స్టైల్ గ్రాఫిక్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆండ్రాయిడ్ లోనే కాదు మైక్రోసాప్ట్ ఎక్స్ పీలోనూ ఈ గేమ్ ఆడొచ్చు. ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్ పీలో బర్డ్ పర్మామెన్స్ ని, స్కిల్స్ ని మరింత ఇంప్రూవ్ చేస్తుంది.
డాష్ బ్లూటూత్ వైర్ లెస్ ఇయర్ హెడ్ ఫోన్స్..
        
న్యూ టెక్నాలజీతో సమ్ థింగ్ స్పెషల్ గా మార్కెట్ లోకి వచ్చేసింది డాష్ బ్లూటూత్ వైర్ లెస్ ఇయర్ హెడ్ ఫోన్స్. జస్ట్ ఇయర్ బడ్ సైజ్ లో ఉండే వీటిని ఫిట్ చేసుకోవడం చాలా సులువు. దిస్ డివైస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ హెడ్ ఫోన్.. ఇట్స్ లైక్ ఏ మ్యూజిక్ ప్లేయర్. ఈ హెడ్ ఫోన్స్ కంప్లీట్లీ వైర్ లెస్ అండ్ వెరీ టైనీ. మీరెక్కడున్నా మీ కిష్టమైన మ్యూజిక్ ను మీ స్మార్ట్ ఫోన్ లో మ్యూజిక్ ప్లేయర్ ద్వారా గానీ, బ్లూటూత్ ద్వారా గానీ కనెక్ట్ చేసుకుని వినొచ్చు. విత్ అవుట్ ఎనీ వైర్స్. యాజ్ యూజువల్ గా మీ కాల్స్ నూ అటెండ్ చేయొచ్చు. ట్రాన్స్ పరెంట్ ఆడియో ఫీచర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ డాష్ హెడ్ ఫోన్స్ లో 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. అంటే నియర్లీ వెయ్యి పాటలను స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలోని బాడీ సెన్సార్లు మీ డేటాను కూడా ట్రాక్ చేస్తాయి. మీ హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్, ఎంత ఎనర్జీ స్పెండ్ చేశారు లాంటి ఫీడ్ బాక్స్ అన్నీ ఇస్తుంది. పైగా ఈ హెడ్ ఫోన్స్ వాటర్ రెసిస్టెంట్.
సెన్ హేజర్స్ హెడ్ సెట్స్..
     
ప్రీమియం గేమింగ్ హెడ్ సెట్ కేటగిరీలోకి సెన్ హేజర్స్ ఎంటరైంది.. అల్టిమేట్ స్టైల్ తో అదిరిపోయే హెడ్ సెట్స్ తో ఎంట్రీ ఇచ్చింది. అవే G4 me Zero.. అండ్ G4 me One. ఇన్ బిల్ట్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇన్ స్టంట్ మ్యూట్ ఎబిలిటీ లాంటి స్పెషల్ ఫీచర్లు ఈ హెడ్ సెట్స్ సొంతం. G4 me One లో ఎయిర్ వెంటిలేషన్ కోసం చెవి చుట్టూ స్పెషల్ డిజైన్ ఉంటుంది. ఇక G4 me Zero లో మాత్రం లార్జ్ ఇయర్ ప్యాడ్స్ తో కంఫర్ట్ ఇయర్ ప్యాడ్స్ ఉంటాయి. యాక్యురేట్ ఆడియో రీ ప్రొడక్షన్ డెలివరీ అదిరిపోయేలా ఉంటుందట. మరి అన్ని ఫీచర్లు ఉన్నాయి కాబట్టే దీని ధర 19,999 రూపాయలు. మైక్రోమాక్స్..స్మార్ట్ ఫోన్ రిలీజ్
     మైక్రోమాక్స్..కాన్వాస్ హిట్ తో అదే సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. అదే మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్. 5 ఇంచ్ డిస్ ప్లే తో 854 బై 480 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగి ఉంటుంది. 4,000ఎంఏహెచ్ బ్యాటరీ.1.3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ లు ఈ ఫోన్ లోని కామన్ ఫీచర్లు. 512ఎంబీ రామ్ , 4జీబీ స్టోరేజ్ తో పాటు , 32 జీబీ కార్డ్ ను సపోర్ట్ చేసే మైక్రో ఎస్ డి స్లాట్ ఫెసిలిటీ కూడా ఉంది. దీనిలోని 5ఎంపీ రియర్ కెమెరాతో 720పిక్సెల్ హెచ్ డి వీడియోలు తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ని ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు 13.5 గంటలు పనిచేస్తుంది. 3జి, బ్లూటూత్, వైఫై, వెగా ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ లో కామన్ ఫీచర్లు. దీని ధర 9,990 రూపాయలు.

 

Tags: 

టాప్ స్టోరీస్