స్పీకర్ ఫట్ జాయే-వీడియో సాంగ్

Submitted on 12 February 2019
Speaker Phat Jaaye song video from Total Dhamaal-10TV

అనిల్ కపూర్, అజయ్ దేవ్‌గణ్, మాధురీ దీక్షిత్, ఈషా గుప్తా తారాగణంగా, ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్.. టోటల్ ధమాల్.. ఫాక్స్ స్టార్ స్టూడియో, అజయ్ దేవ్‌గణ్ ఫిలింస్, అశోక్ థకేరియా, ఇంద్ర కుమార్, శ్రీ అధికారి బ్రదర్స్, మరియు ఆనంద్ పండిట్ కలిసి నిర్మిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్, సోనాక్షీ సిన్హా.. మున్గుడా వీడియో సాంగ్‌కి రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు స్పీకర్ ఫట్ జాయే.. అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటలో అనిల్ కపూర్, అజయ్ దేవ్‌గణ్, మాధురీ దీక్షిత్, ఈషా గుప్తా, బొమన్ ఇరానీ, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, అర్షద్ వార్షీ, రితేష్ దేష్‌ముఖ్ తదితరులు సందడి చేసారు.

అజయ్, ఈషా, అనిల్, మాధురిల కెమిస్ట్రీ బాగుంది. గౌరవ్-రోషన్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి.. కుమార్ లిరిక్స్ రాయగా, రంజూ వర్గీస్ కొరియోగ్రఫీ చేసాడు.  ఈ మూవీలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. జాకీ ష్రాఫ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు.  ఫిబ్రవరి 22న టోటల్ ధమాల్ థియేటర్స్‌లోకి రానుంది.

వాచ్ వీడియో సాంగ్...


          

Total Dhamaal
Ajay Devgan
Madhuri Dixit
Gourov-Roshin
Indra Kumar


మరిన్ని వార్తలు