బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిని పట్టేస్తారు

Submitted on 17 January 2020
Space Technology Telangana Police

టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. దీనిని అందిపుచ్చుకుని దూసుకెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు టెక్నాలజీని అనుసంధానం చేసుకుని నేరాలను నియంత్రిస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసింది. నేరాల నియంత్రణకు స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. 2020, జనవరి 16వ తేదీ గురువారం తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ కార్యాలయంలో ట్రాక్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాసరెడ్డి, ట్రాక్ సైంటిఫిక్ ఇంజనీర్లతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు.

 

రోడ్డు ప్రమాదం జరిగినా..బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా..క్షణాల్లో తెలిసిపోయే విధంగా ప్లాన్ చేశారు. క్షణాల్లో డీజీపీ కార్యాలయానికి తెలిసిపోయేలా..నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొనేలా చర్యలు తీసుకబోతున్నారు. అన్ని పీఎస్‌ల సరిహద్దుల నిర్ధారణకు స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. 

 

పోలీసు శాఖకు చెందిన స్థలాలు, స్టేషన్ల, కార్యలయ భవనాలు, ఇతర శాశ్వత ఆస్తుల పరిరక్షణకు జియో ఫెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేయాలని ట్రాక్ అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా..రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి వాటిని కూడా జియో మ్యాపింగ్ చేయాలని డీజీపీ కోరారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్రంలో నేరాలను తగ్గించడం, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని డీజీపీ వెల్లడించారు. 

Read More : FASTag లేకుంటే..ఆ రాయితీ రాదు


సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు