రూ.7,560కే సౌత్‌ ఇండియా టెంపుల్‌ టూర్‌

Submitted on 17 November 2019
South India Temple Tour  for rs.7560

భారత్ దర్శన్ రైలు యాత్ర 2020 జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈమేరకు  ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. 7 రాత్రులు, 8 పగళ్లు ఈ యాత్ర కొనసాగనుంది. శ్రీరంగం, తంజావూరు, రామేశ్వరం, మదురై, మహాబలిపురం, కంచి, తిరువనంతపురం క్షేత్రాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. జనవరి  3వ తేదీన అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు...  సికింద్రాబాద్ నుంచి భారత్ దర్శన్ రైలు ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కే అవకాశం కల్పించారు. 

ప్యాకేజీలో రైలు టికెట్లు, బస, ఉదయం టిఫిన్, టీ, కాఫీ, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, రోజుకు ఒక లీటర్ నీళ్ల బాటిల్, స్థానిక విహారానికి నాన్ ఏసీ బస్సు ఉంటాయి. వివరాల కోసం సికింద్రాబాద్ 04027702407, 9701360701, 8287932227, 8287932228, 8287932229 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. www.irctctourism.com వెబ్‌సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. కంఫర్ట్ ఏసీ త్రీటైర్ రూ.9వేల 240 ఒక్కరికి, స్టాండర్డ్ స్లీపర్ రూ.7 వేల 560 ఒక్కరికి ఛార్జీలు ఉంటాయని తెలిపారు.
 

south India
Temple Tour
rs.7560
irctc

మరిన్ని వార్తలు