ప్రపంచ కప్‌కు ధోనీ కొత్త అవతారం: దాదా

Submitted on 11 February 2019
sourav ganguly praised ms dhoni for his performance


ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ముందు ధోనీ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. దీంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆసీస్, న్యూజిలాండ్ పర్యటనల అనంతరం మరోసారి తన సత్తా చాటి చెప్పడంతో క్రికెట్ విశ్లేషకులంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనీ కొత్త అవతారంలో కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ మీడియాతో మాట్లాడాడు. 

'ప్రపంచ కప్ జట్టులో ధోనీని తీసుకోవాలా.. వద్దా అనే సందేహాన్ని పటాపంచలు చేస్తూ తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఒకవేళ ప్రపంచ కప్ భారత్ జట్టులో తీసుకుంటే ఓ అదనపు బలంగా ఉంటాడు. ధోనీతోపాటుగా యువ క్రికెటర్లు రిషబ్‌పంత్‌, విజయ్‌శంకర్‌ ఈ రెండు సిరీస్‌లలో చక్కటి ప్రదర్శన చేశారు. అయితే విజయ్‌శంకర్‌ ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడని భావించట్లేదు. ఈ పర్యటనల్లో షమీ బౌలింగ్‌లో చాలా పరిణతి కనిపిస్తోందని' కొనియాడాడు. 

న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడేసిన భారత్ విదేశీ పర్యటనలు ముగించుకుని భారత్ చేరుకుంది. ఫిబ్రవరి 24నుంచి  సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న 5వన్డేలు, 2టీ20లలో ఆడనుంది. 

MS Dhoni
sourav ganguly

మరిన్ని వార్తలు