ట్రంప్‌పైకి ఫోన్ విసిరి కొట్టాడు

Submitted on 28 April 2019
Someone Threw a Cell Phone on Trump

రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే వారిపై చెప్పులు విసరడం చూస్తూనే ఉంటాం. అయితే చిన్న చిన్న నేతలపై ఇలా దాడులు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇటువంటి పరాభవమే ఎదురైంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ ప్రాంతంలో జరిగిన నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ట్రంప్‌కు ఇటువంటి పరిస్థితే ఎదురైంది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడేందుకు వేదికపైకి ఎక్కుతుండగా ఓ వ్యక్తి ఆయనపైకి ఫోన్ విసిరాడు. అయితే అది ట్రంప్‌కు దగ్గరగా వచ్చినప్పటికీ తగలలేదు. ఆయనకు కొద్ది దూరంలో వేదికపై పడింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. వ్యక్తి అరెస్ట్ అనంతరం ట్రంప్ యధావిధిగా తన ప్రసంగం కొనసాగించారు. ట్రంప్ మాట్లాడుతున్నంత సేపూ ఆ ఫోన్ వేదికపై అలాగే ఉండడం విశేషం. మద్యం మత్తులో ఆ వ్యక్తి ట్రంప్ పైకి పోన్ విసిరాడని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతని పేరు విలియమ్ రోస్‌గా వెల్లడించారు.

trump
Indiana
america
phone

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు