మియాపూర్‌లో మోసగాడు: జాబ్‌లిస్తానని నగ్నంగా వీడియో కాల్స్

Submitted on 24 August 2019
Software engineer from TN held for exploiting women

మియాపూర్ పోలీసులు శుక్రవారం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను అరెస్టు చేశారు. తమిళనాడులోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వెలగబెడుతున్న ప్రదీప్(మారు పేరు) మహిళల నగ్న ఫొటోలను సేకరించడం, ఆ తర్వాత వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ కోరిక తీర్చుకునేవాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత మహిళ కేస్ పెట్టడంతో బండారం బయటపడింది. 

తమిళనాడులోని తిరువొత్తియూర్‌కు చెందిన క్లెమెంట్ రాజ్ అలియాస్ ప్రదీప్(33) ఎన్ఎంసీ చెన్నై బ్యాంకు కాలనీలో ఉంటున్నాడు. భార్య ఉద్యోగం చేస్తుండటం, ఏడేళ్ల కొడుకు స్కూల్‌కు వెళ్లిపోతుండటంతో పాటు నైట్ షిప్ట్‌కు వెళ్లి వచ్చే ప్రదీప్ పగలంతా ఖాళీగా ఉండేవాడు. ఖాళీ సమయం అతనిని తప్పుడు దారికి ప్రేరేపించింది. 

జాబ్ కావాలని వెబ్ సైట్లో నమోదు చేసుకునే అమ్మాయిల్ని టార్గెట్ చేసుకున్నాడు. వారికి ఫోన్ చేసి తాను స్టార్ హోటళ్లో రిసెప్షనిస్టు జాబ్‌లు ఇప్పిస్తానని అమ్మాయిలా మాట్లాడేవాడు. అలాగే చాటింగ్ చేసి నమ్మించేవాడు. ఆ తర్వాత మీరు చేయాలనుకునే ఉద్యోగానికి అందంగా ఉండడం ముఖ్యమని ఆరంభించేవాడు. పరిచయం పెరిగే కొద్ది శరీరాకృతులు సరిపోయేలా ఉండాలని తాను చెక్ చేసి పంపుతానని నగ్నంగా ఉన్న ఫొటోలను పంపాలని చెప్పేవాడు. నిరాకరించిన వారికి ప్రోసెస్ స్టార్ట్ అయిపోయిందని మధ్యలో ఆపకూడదని, పలు కారణాలతో భయపెట్టి ఒత్తిడి తెచ్చేవాడు. 

ఫొటోలు చేతికొచ్చాక సీన్ రివర్స్. నగ్నంగా ఉన్న ఫొటోలు చేతికి రావడంతో ఆమె.. ఆయనలా మారేవాడు. ఫొటోలు తన దగ్గర ఉన్నాయని ఫోన్ చేసి బెదిరిస్తూ.. వాళ్లు నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని ఆదేశించేవాడు. కాదని వారిస్తే అవి బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భయంతో 16రాష్ట్రాలకు చెందిన యువతులు, మహిళలు లొంగిపోగా మియాపూర్ యువతి చేసిన కంప్లైంట్‌తో అంతా బట్టబయలు అయింది. 

ఫిర్యాదు అందిన వెంటనే నెంబర్ సహాయంతో కాల్ రికార్డులను ట్రేస్ చేసి నిందితుడిని గుర్తించారు. చెన్నైలో నివాసముండే నేరగాడ్ని హైదరాబాద్‌కు పిలిపించారు. ప్రాథమిక పరీక్షలోనే నిర్దారణ అయినప్పటికీ పూర్తి స్థాయి విచారణ కోసం మరో 15రోజులు అదుపులో ఉంచుకోనున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని నేరస్థుడికి తగిన శిక్ష పడేలా చేస్తామని స్టేషన్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్ శ్యామల తెలిపారు. 

software engineer
TN
tamilnadu
Women
engineer
crime

మరిన్ని వార్తలు