ఉద్యోగం కోల్పోతాననే భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Submitted on 20 November 2019
software employee Suicide in hyderabad

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం కోల్పోతాననే భయంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలిలో తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హరిణి అనే 24 ఏళ్ల వయస్సు గల యువతి హైదరాబాద్ మాదాపూర్ లోని గోల్డెన్ హిల్స్ సంస్థలో రెండున్నరేళ్లుగా పని చేస్తోంది. క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగినిగా పని చేస్తోంది. 

డిసెంబర్ తో తన జాబ్ కాంట్రాక్ట్ ముగియనుంది. ఉపాధి కోల్పోతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తన ఉద్యోగానికి సంబంధించిన కాంట్రాక్టు డిసెంబర్ తో పూర్తి కానుండటంతో మరోసారి తనకు ఉద్యోగం వస్తుందో రాదో అనే మనోవేధనతో ఆత్మహత్యకు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తనతోపాటు మరికొంతమందికి డిసెంబర్ నెలతో కాంట్రాక్టు గడువు పూర్తి అవుతుంది.

ఇప్పుడు ఉద్యోగులకు మరోసారి ఉద్యోగాలు దొరుకుతాయా లేదా అన్న ఆందోళనలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారణంగానే హరిణి కొన్ని రోజులుగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నట్లు పోలీసులకు సమచారం ఉంది. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనకాల వేరే కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 
 

software employee
harini
Suicide
madapur
Hyderabad

మరిన్ని వార్తలు