గెలుపోటముల్లో 5శాతం ఇంపాక్ట్ : అభ్యర్థుల రాతను డిసైడ్ చేస్తున్న సోషల్ మీడియా

Submitted on 13 March 2019
Social Media Impact On Voters

100 ఓట్లు తెచ్చేలా ఉంటే చాలు వారిని లీడర్లు అక్కున చేర్చుకుంటారు. అదే వెయ్యి ఓట్లైతే కార్యకర్తల్లో మంచి గుర్తింపు ఇచ్చే హోదా ఇస్తారు. మరి ఏకంగా 5శాతం ఓటర్లని ప్రభావితం చేయగలరంటే.. ఎక్కడికో తీసుకెళ్తారు కదూ.. ఇప్పుడు అలా 5శాతం ఓటర్లని ప్రభావితం చేసే ఓ మాధ్యమం.. పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.. అదే సోషల్ మీడియా.

ఒక్క శాతం.. ఆ మాటకి వస్తే అరశాతం ఓట్ల తేడా చాలు.. పార్టీల ఫేట్ మార్చడానికి.. మరి ఏకంగా 5శాతం వరకూ మేనేజ్ చేసే అంశం ఉందంటే.. అది ఎంత ముఖ్యమైనదో అర్ధం అవుతుంది. ఇంతకీ ఇదేదో కులం కార్డో.. మతం ప్రాతిపదికో కాదు.. సోషల్ మీడియా ప్రభావం.. దీని ఎఫెక్ట్ ఏ రేంజ్‌కి చేరిందంటే.. ఏకంగా 5శాతం ఓటర్లపై ఈ సోషల్ మీడియా తన ప్రతాపం చూపుతుందని అంటున్నారు. మన ప్రజాస్వామ్యంలో 49శాతం వచ్చినా..జీరో అని..దానికి అదనంగా వచ్చి చేరే 2శాతమే అసలు హీరో అని కూడా అంటుంటారు. అంటే దాని అర్ధం..అదనంగా వచ్చే ఆ 2శాతమే అసలు విజేతని నిర్ణయిస్తుంది.
Read Also : ఎందుకిలా : వైసీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ వాయిదా

అలానే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నంలో ఈ నెటిజన్ల ప్లాట్‌ఫామ్స్ ఓటర్లపై బలంగా పని చేస్తుందని తేలింది. ఇది ఇంత బలమైన మాధ్యమంగా మారింది కాబట్టే.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాపై నిఘా పెడతామని, నకిలీ వార్తలను కట్టడి చేస్తామని ప్రకటించింది.

2014 ఎన్నికల్లో సోషల్ మీడియాను బలంగా వాడుకున్న నరేంద్ర మోడీ, యువతకు దగ్గరై ప్రధాని పదవి చేపట్టారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకు క్రేజ్ ఎక్కువే. దీంతో కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. ఈసారి 7 దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంత మేర ఉంటుందనే చర్చ మొదలైంది. దీనిపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్ దాస్ సోషల్ మీడియా ఓటర్లపై 5శాతం ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయాలకు ఇది కీలకాంశం కానుందని ఆయన అభిప్రాయం.

యువత అందులోనూ తొలిసారి ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్నవారు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కొత్త ఓటర్లు టీవీలకంటే యూట్యూబ్, ఫేస్ బుక్ చూసేవాళ్లే ఎక్కువ. మొబైల్ రెవల్యూషన్ రావడంతో స్మార్ట్ ఫోన్లలో డేటా వాడకం ఎక్కువైంది. దీంతో అనివార్యంగా వచ్చిపడే సోషల్ పబ్లిసిటీ జిమ్మిక్కులు వారిని ప్రభావితం చేస్తాయ్. అందుకే పార్టీలు కూడా వీరిని టార్గెట్ చేసుకుని తమ ప్రచారాలకు మెరుగులు పెడుతున్నాయ్.

సోషల్ మీడియా ప్రచారం విషయంలో బీజేపీ ముందుందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తన సోషల్ మీడియా లాంగ్వేజ్ మార్చుకోవాలని అప్పుడే ఆ పార్టీ కూడా దూసుకెళ్తుందని అంటున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం సోషల్ మీడియా 5శాతం ఓటర్లని ప్రభావితం చేయగలదన్నదే కలకలం రేపుతున్న అంశం.
Read Also : రాహుల్ కే షాక్ : సీఎం కేసీఆర్ తో సబిత, కార్తీక్ రెడ్డి భేటీ

social media
impact
voters
Elections
Facebook
Twitter
istagram
WhatsApp

మరిన్ని వార్తలు