తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ లో ‘స్మార్ట్’ కిచెన్ గార్డెన్ 

Submitted on 25 May 2019
Smart kitchen gardens at Telangana government schools soon

తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్స్‌లోని ఆవరణ కూరగాయల సాగుగా మారిపోయింది. స్కూల్స్‌లో స్మార్ట్ కిచెన్ గార్డెన్‌తో ప్రభుత్వ స్కూల్స్ కళకళలాడుతున్నాయి. పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన, పౌష్టికమైన ఆహారాన్ని అందించాలన్నలక్ష్యంతో కూరగాయల సాగును చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో వినియోగించే కూరగాయలను కిచెన్ గార్డెన్ ద్వారా పండిస్తున్నారు.

కిచెన్ గార్డెన్ ప్రోగ్రాం పైలట్ ప్రాజెక్టు ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో 2017లో 1,203 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలు సాధించింది. నగరంలోని ప్రభుత్వ స్కూల్స్‌లో సరైన ఖాళీ స్థలాలు ఉండవు. అర్బన్ కిసాన్ అనే స్టార్టప్ కంపెనీ ముందుకొచ్చింది. 10 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు రెండేసి హైడ్రో ప్లాంటర్ పాట్స్ స్టాండ్‌లను అందజేసింది. కొద్దిపాటి స్థలంలోనే కూరగాయలు, ఆకు కూరలు పెంచేందుకు వీలుంటుంది. ఈ స్మార్ట్ స్టాండ్‌లతో 400 పైగా మొక్కల్ని పెంచవచ్చు.

ఈ హైడ్రో ప్లాంటర్ పాట్స్ పద్ధతి ద్వారా నీటిని నిల్వ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సాధారణంగా మట్టితో పెంచే మొక్కలకు నీరు ఎక్కువ శాతం అవసరం పడుతుంది. కానీ హైడ్రో ప్లాంటర్ పాట్స్ లకు 95 శాతం తక్కువ నీటి వినియోగంతో మొక్కలు పెరుగుతాయి.

అంతేకాదు ఇలా పెంచే మొక్కలకు చీడ పీడల బాధ కూడా పెద్దగా ఉండదు. ఎటువంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించుకుండా కూరగాయల్ని, ఆకు కూరల్ని పెంచవచ్చు. ప్రతి పాట్ లేక కంటైనర్ 125 గ్రా -150 గ్రా కూరగాయలను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దిగుబడి అధికం అవుతుంది. స్కూల్స్ అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచుకోవచ్చని అర్బన్ కిసాన్ సంస్థకు చెందిన శ్రీనివాస్ చాగంటి తెలిపారు.

Telangana
government schools
Smart kitchen gardens

మరిన్ని వార్తలు