
ఈ వార్త వింటేనే వణుకు.. చూస్తే షాక్. ఇలాంటి ఘోరం ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో జరిగి ఉండదు. మాటల్లో కాదు.. విజువల్ వస్తే ఒళ్లు జలదరిస్తోంది. హైదరాబాద్ బండ్లగూడ పెబెల్ సిటీలో జరిగిన ఘటన హైదరాబాద్ ను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బండ్లగూడ పెబెల్ సిటీ అది. ఇళ్ల బయట పిల్లలు ఆడుకుంటున్నారు. చుట్టూ ఎంతో మంది. పిల్లలు ఆటల్లో బిజీగా ఉన్నారు. పెద్దలు వాకింగ్, జాకింగ్ చేస్తున్నారు. మూసీన్ అనే పిల్లోడు కూడా మిగతా పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. బాల్ ఓ కరెంట్ పోల్ సమీపంలోకి వెళ్లింది. బాల్ కోసం కరెంట్ స్తంభం దగ్గరకు వెళ్లిన చిన్నారి మూసీన్.. సరదాగా దాన్ని పట్టుకున్నాడు. అంతే అలాగే ఉండిపోయాడు.
ఒకటి, రెండు నిమిషాలు కాదు. ఏకంగా 5 నిమిషాలు అలాగే
ఉండిపోయాడు. కొంత మంది చూశారు.. ఆటల్లో భాగంగా అలాగే ఉన్నాడు అనుకున్నారు. అయితే మూసీన్ ఫ్రెండ్స్ కూడా కేకలు వేస్తున్నారు కానీ దగ్గరకు వెళ్లలేదు. ఎంత సేపటికీ చిన్నారి మూసీన్ కదలకుండా అలాగే ఉండటంతో.. అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లారు. ఉలుకూ పలుకూ లేదు.. కరెంట్ పోల్ పట్టుకున్న చిన్నారి కదలకుండా ఉండటం చూసి కేకలు వేశారు. అప్పటికిగానీ మిగతా వాళ్లు అలర్ట్ కాలేదు. దగ్గరకు వెళ్లి కదిలించారు కొందరు. కుప్ప కూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే చనిపోయినట్లు నిర్థారించారు డాక్టర్లు. తీవ్రమైన కరెంట్ షాక్ కొట్టడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. మూసీని తల్లిదండ్రులు తమిళనాడు వాసులు. హైదరాబాద్ సిటీలో ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నారు. జరిగిన ఘోరంతో వారు షాక్ లో ఉన్నారు. ఎంతో సెక్యూరిటీ, క్వాటిటీ లైఫ్ ఉంటుందనే భావించే గేటెడ్ కమ్యూనిటీలోనే ఇలాంటి ఘోరం జరగటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పేరంట్స్. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు
Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో
Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు
Also Read: రికార్డుల వేట : కొత్త చరిత్రకు దగ్గరలో ధోనీ