డోర్స్ లేని సింగిల్ రూమ్ : అద్దె రూ.50 వేలు!!

Submitted on 12 April 2019
Single-Room with No Doors But Rent Rs.50K

ఓ సింగిల్ రూమ్ రెంట్ రూ.51,560. హా....రూ.50 వేలు అద్దె ఇస్తే ఏకంగా ఓ విల్లా నే వస్తుంది. కానీ ఓ సింగిల్ రూమ్ రెంట్ రూ.51,560 అంవటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. పైగా ఈ రూమ్ కు తలుపులు (డోర్స్ ) కూడా లేవు. అదేంటీ తలుపులు లేకుంటే లోపలికి ఎలా వెళతాం? బైటకు ఎలా వస్తాం అని అనుకుంటున్నారు కదూ. ఓ సింగిల్ రూమ్ రూ.50 వేల అద్దె అంటే ఏదోక విశేషం ఉండే ఉంటుంది కదూ. మరి అదేంటో తెలుసుకుందాం...


తలుపులు కనిపించవు. ఒక వైపు కిటికీ, మరోవైపు అల్మారా మాత్రమే కనిపిస్తాయి. రూ50 వేలు అద్దె కడుతు డోర్స్ లేకుండా కిటికీలోంచి వెళ్లి రావటమేంటి ఛీ.. అనుకుంటున్నారా..ఇక్కడే ఉంది అసలు కిటుకంతా..నెలకు రూ.51,560 ఇస్తున్నామంటే.. చెప్పుకోడానికి గొప్పగా ఉండాలి కదా. అదే స్పెషల్..బయటకు కనిపించని విధంగా తలుపులు ఉంది. ఈ గదికి చూసేందుకు బెడ్, అల్మరా, కిటికీ, టేబుల్, కుర్చీ, బేస్ బాల్ క్యాప్ మాత్రమే కనిపిస్తాయి. కానీ పరీక్షగా చూస్తే మాత్రమే  గదిలో మూలకు ఉన్న అల్మరాకు కింద చక్రాలు ఉంటాయి. 

ఆ అల్మరాను ముందుకు లాగితే.. దాని వెనుక ఉండే డోర్ ఉంటుంది. బయటకు వెళ్లేప్పుడు అల్మారాను ముందుకు లాగి ఒక పక్కకు పెడతారు. లోపలికి వచ్చిన తర్వాత డోర్ మూసేసి మళ్లీ దాన్ని యథాస్థానానికి పెట్టేస్తారు. లండన్‌లో ఉన్న ఈ ఈ విచిత్రమైన గది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Single-Room
No Doors
Rental
Rs.50K
London

దేశంలో టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయటాన్ని సమర్ధిస్తారా?

Choices

మరిన్ని వార్తలు