వన్ నేషన్ - వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

Submitted on 15 February 2019
single emergency number 112 to help you connect to all nearby helplines

ఎమర్జెన్సీ సమయంలో హెల్త్, ఫైర్, పోలీసు ఇలా ఇతర హెల్ప్ లైన్ నంబర్లను గుర్తుపెట్టుకోవడం కష్టమే మరి. సరైన నంబర్ తెలియక తికమక పడాల్సిన పరిస్థితి ఎదురువుతోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కొత్త యూనిక్ ఎమర్జెన్సీ నంబర్ వచ్చేస్తోంది. అందరికోసం కేంద్ర ప్రభుత్వం సింగిల్ ఎమర్జెన్సీ నంబర్ ను అందుబాటులోకి తెస్తోంది. అదే.. 112.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్. మీరు ఎమర్జెన్సీ సమయంలో ఈ ఒక్క నెంబర్ కు ఫోన్ చేస్తే చాలు.. క్షణాల్లో స్పందించి మీకు తక్షణ సాయం అందించే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS) కింద 112 ఏకైక ఎమర్జెన్సీ నెంబర్ ను లాంచ్ చేయనున్నారు. సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (CDAC)ఈ హెల్ప్ లైన్ నంబర్ టెక్నాలజీని డిజైన్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ ERSS సేవలు
ఈ ERSS విధానాన్ని గత ఏడాదిలో హిమాచల్ ప్రదేశ్ లో తొలిసారి లాంచ్ చేశారు. 2019 ఏడాది ఫిబ్రవరి 19న ఈఆర్ఎస్ఎస్ విధానాన్ని లాంచ్ చేసి.. మరో 14 రాష్ట్రాల్లో అందుబాటులోకి తేనున్నారు. అందులో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. మల్టిపుల్ హెల్ప్ లైన్ నంబర్లను గుర్తించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంటిగ్రేట్ చేసి ERSS విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అన్నీ హెల్ప్ లైన్ ఎమర్జెన్సీలకు కలిపి 112 సింగిల్ ఎమర్జెన్సీ నెంబర్ ను అనుసంధానం చేశారు. ఇందులో ఫైర్ డిపార్ట్ మెంట్, హెల్త్, ఇతర హెల్ప్ లైన్ నంబర్లన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. 112 నంబర్ కు కాల్ చేస్తే చాలు.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ద్వారా తక్షణ సాయం పొందొచ్చు. 
 

ERSS ఏంటో తెలుసా?
ఈఆర్ఎస్ఎస్ అంటే.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS). అత్యవసర సమయాల్లో తక్షణ సాయం పొందేందుకు ఈ విధానాన్ని రూపొందించారు. ఈ వ్యవస్థకు వాయిల్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్, ఈఆర్ఎస్ఎస్ వెబ్ సైట్, ప్యానిక్ బటన్ వంటి అన్నీ ఎమర్జెన్సీ సిగ్నల్స్ మీ ఫోన్ నుంచే సిగ్నల్స్ అందుతాయి. ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఈఆర్సీని (ERC) ఇంటిగ్రేట్ చేశారు. టెలికం సర్వీసు ప్రొవైడర్స్ అందించే లొకేషన్ బేసిడ్ సర్వీసు ఆధారంగా ఇదంతా పనిచేస్తుంది. 
 

ఎమర్జెన్నీ నంబర్ ఎలా పనిచేస్తుందంటే..
* ఎమర్జెన్నీ అవసరమైతే.. మీ ఫోన్ నుంచి సింగిల్ ఎమర్జెన్సీ నంబర్ 112 కు డయిల్ చేయాలి.
* మీ ఫోన్ పవర్ బటన్ ను మూడుసార్లు గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడు వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ వెళ్తుంది. 
* స్మార్ట్ ఫోన్ లేని పక్షంలో బేసిక్ ఫీచర్ ఫోన్ ఏదైనా సరే.. 5, లేదా 9 నెంబర్ ప్రెస్ చేస్తే వెంటనే ఈఆర్ఎస్ఎస్ కు సమాచారం వెళ్తుంది.
* ERSS వెబ్ సైట్ కు వెళ్లి అక్కడ ఎమర్జెన్సీ హెల్ప్ కోరొచ్చు. 
* మీ స్మార్ట్ ఫోన్ లో 112 ఇండియా అనే యాప్ ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ నుంచి తక్షణ సాయం పొందొచ్చు. ఇందులో అలర్ట్ మెసేజ్ లు, లొకేషన్ డేటా, 112 ఎమర్జెన్సీ కాల్ చేయొచ్చు. 
* మహిళల కోసం ప్రత్యేకించి 112 ఇండియా యాప్ లో ‘SHOUT’ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులో  మహిళలు అత్యవసర సమయాల్లో ERC సెంటర్ నుంచి తక్షణ సాయం పొందొచ్చు.

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : ర‌క్తం మ‌రుగుతోంది : బుడ్గామ్ సీఆర్పీఎఫ్ క్యాంప్ కి జ‌వాన్ల‌ మృతదేహాలు

Also Read : ఐసీసీ ట్వీట్: సోలో లైఫే సూపర్.. సింగిల్‌గానే ఉండు

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే

Single
emergency number
112
helplines

మరిన్ని వార్తలు