మీ జీమెయిల్ భద్రమేనా? : రికవరీ ఫోన్ నెంబర్ తో ‘ఫిషింగ్’కు చెక్!

Submitted on 21 May 2019
Simply Adding A Recovery Phone Number Stops Most Phishing Attempts

మీ జీమెయిల్ అకౌంట్ భద్రమేనా? తస్మాత్ జాగ్రత్త. హ్యాకర్లు చొరబడే అవకాశం ఉంది. మీకు తెలియకుండానే మీ పాస్ వర్డ్, అకౌంట్ ను హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీమెయిల్ ఇన్ బాక్స్ లో, స్పామ్ బాక్స్ లో వచ్చే అనుమానాస్పద ఈమెయిల్స్ కు స్పందించకపోవమే మంచిది. లేదంటే.. కీలాకర్లతో మీ మెయిల్ ను సైబర్ క్రిమినల్స్ ఫిషింగ్ చేస్తారు జాగ్రత్త. జీమెయిల్ అకౌంట్ కు కేవలం పాస్ వర్డ్ ఒక్కటి మాత్రమే ఫుల్ సెక్యూరిటీ ఇవ్వలేదు.

సెక్యూరిటీ ఫీచర్లను ఎనేబుల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఇలాంటి ఫిషింగ్ మెయిల్స్ నుంచి గూగుల్ అకౌంట్ ను ప్రొటక్ట్ చేసుకోవచ్చు. చాలామంది గూగుల్ యూజర్లు.. తమ అకౌంట్ కు రికవరీ ఫోన్ నెంబర్ సెట్ చేసుకోరు. అకౌంట్ పాస్ వర్డ్ మరిచిపోయినప్పుడు మాత్రమే ఫోన్ నెంబర్ అవసరం కాదు.. మీ అకౌంట్ సెక్యూరిటీకి కూడా రికవరీ ఫోన్ నెంబర్ అత్యవసరం. గూగుల్ అకౌంట్లపై ఫిషింగ్ ఎటాక్స్ పై ఇటీవల కొంతమంది రీసెర్చర్లు అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి నివేదకను ‘ది వెబ్ కాన్ఫిరెన్స్’ లో రీసెర్చర్లు ప్రదర్శించారు. 

రికవరీ ఫోన్ నెంబర్.. యాంటీ హ్యాక్ టూల్ : 
రీసెర్చర్ల అధ్యయనం ప్రకారం.. మీ గూగుల్ అకౌంట్ కు సింపుల్ గా రికవరీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇలా చేయడం ద్వారా 100 శాతం ఆటోమాటెడ్ ఎటాక్స్ ను బ్లాక్ చేసినట్టు గుర్తించారు. అంతేకాదు.. 99 శాతం బల్క్ ఫిషింగ్ ఎటాక్స్ తో పాటు 66 శాతం సగటున టార్గెటడ్ ఎటాక్స్ ను అడ్డుకున్నట్టు పరిశోధనలో గుర్తించారు. రికవరీ ఫోన్ నెంబర్..15 సెకన్ల వ్యవధిలో సెట్ చేసుకోవడం ఎంతో ఈజీ.. యాంటీ హ్యాక్ టూల్ గా అకౌంట్ ను ప్రొటక్ట్ చేస్తుందని పరిశోధకులు తెలిపారు. 

Recovery Phone Number Stops Most Phishing Attempts, Claims Google Dataసెక్యూరిటీ ఫీచర్లతో కలిగే బెనిఫెట్స్ కు సంబంధించి గూగుల్ హార్డ్ డేటాను రిలీజ్ చేసింది. గూగుల్ సెక్యూరిటీ చెక్ ప్.. యూజర్ల యాక్టివేషన్ కోసం వెరైటీ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి ర్యాండమైజ్ డ్ ఎటాక్స్ నుంచి అకౌంట్ సెక్యూర్ చేసుకోవాలంటే కేవలం SMS ద్వారా వెరిఫికేషన్ మాత్రం సరిపోదు. బైపాస్ వే ద్వారా ఎటాకర్లు ఫిషింగ్ కు ప్రయత్నిస్తుంటారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి అనుమానాస్పద సైన్ ఇన్ అకౌంట్లను గూగుల్ ఆటోమాటిక్ గా బ్లాక్ చేస్తుంటుంది. 

అకౌంట్ లాక్ ఇష్యూ ఇక్కడే : 
బ్రాండ్ కొత్త డివైజ్ నుంచి కొత్త లొకేషన్ లో అకౌంట్ లాగిన్ అయితే.. సెక్యూరిటీ పరంగా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 38శాతం మంది యూజర్లు తమ ఫోన్ ద్వారా యాక్సస్ చేసుకోలేరు. మరికొంతమంది యూజర్లలో 34శాతం మందికి సెకండరీ ఈమెయిల్ అడ్రస్ పొందలేరు. దీంతో ఎక్కువ మంది యూజర్లు.. అకౌంట్ లాక్ సమస్యను ఎదుర్కొంటున్నారు.

చాలామంది జీమెయిల్ యూజర్లు.. లాగిన్ అయ్యే సమయంలో తమ అకౌంట్ సెక్యూరిటీ కోసం.. టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ యాక్టివేట్ చేసుకుంటారు. ఇది ఎంతో ఉత్తమం. జీమెయిల్ యూజర్లు తమ అకౌంట్  క్రియేట్ చేసుకున్న సమయంలోనే రికవరీ ఫోన్ నెంబర్ సెట్ చేసుకున్నట్టయితే.. ఫిషింగ్ ఎటాక్ ను అడ్డుకోవచ్చు. హ్యాకర్లు.. ఒకవేళ.. మీ అకౌంట్ పాస్ వర్డ్, ఇతర వివరాలను హ్యాక్ చేసినప్పటికీ.. ఫిజికల్ గా వారిని అకౌంట్లోకి లాగిన్ కాకుండా అడ్డుకోవచ్చనని పరిశోధకులు తమ అధ్యయనంలో తెలిపారు.  
Simply Adding A Recovery Phone Number Stops Most Phishing Attempts

Recovery Phone Number
Phishing Attempts
Google Data
Google account
anti-hack tool

మరిన్ని వార్తలు