అప్లై చేసుకోండి: కేంద్ర బలగాల్లో SI, ASI పోస్టులు

Submitted on 9 October 2019
SI, ASI Recruitment 2019 Apply Online

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)  కేంద్ర బలగాల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసకోవాల్సి ఉంటుంది.

రాతపరీక్ష పేపర్-1 విధానం: 
పేపర్ 1 పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 50 ప్రశ్నలు (50 మార్కులు), జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు (50 మార్కులు), క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు (50 మార్కులు) ఈ విధంగా పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో అర్హత సాధించిన వారికి పీఈటీ ఉంటుంది. పీఈటీ లోను క్వాలిఫై అయిన వారికి పేపర్ 2 రాసే అవకాశం లభిస్తుంది.

పేపర్-2 విధానం: 
పేపర్ 2 పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లలోనూ నెగిటీవ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కుల కోతవిధిస్తారు. పరీక్షలో అర్హత పొందేందుకు రెండు పేపర్లలో వేర్వేరుగా జనరల్ అభ్యర్ధులు 30శాతం, OBC, EBCలకు 25శాతం, SC, STలకు 20శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. రెండు పేపర్లలో పొందిన మార్కులు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని అభ్యర్ధులకు మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు.

దరఖాస్తు చివరితేది: 16.10.2019

Read Also..అప్లై చేసుకోండి: వెస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు

SI
asi
recruitment 2019
Apply Online

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు