చిన్నగా అయిపోతున్న చంద్రుడు: సైంటిస్ట్‌లు

Submitted on 15 May 2019
Shrinking Moon May Be Generating Moonquakes

రోజురోజుకీ చంద్రుడు చిన్నగా అయిపోతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. చంద్రుడిపై అంతర్గతంగా ఉన్న చల్లదనం, ఇతర కారణాల కారణంగా చంద్రుడు చిక్కిపోతున్నట్లు అమెరికా సైంటిస్ట్‌లు తెలిపారు. అయితే ఈ పరిణామం ఇప్పటికిప్పుడు జరిగింది కాదని, కొన్ని వందల మిలియన్‌ల నుంచి జరుగుతుందని సైంటిస్ట్‌లు వెల్లడించారు. ఇప్పటివరకు 150 అడుగుల (50మీటర్ల) కన్నా ఎక్కువగా కుచించుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ ప్రొఫెసర్ నికోలస్‌ తెలిపారు.

చంద్రునిపై ఈ పరిణామం కారణంగా ఉపరితలం ముడుచుకుపోతుందని, అలాగే చంద్ర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సైంటిస్ట్‌లు. నాసాకు చెందిన లూనార్‌ రీకానిసెన్స్‌ ఆర్బిటార్‌ తీసిన 12 వేల చంద్రుడి చిత్రాలను విశ్లేషించిన సైంటిస్ట్‌లు.. చంద్రుడి ఉత్తర ధృవానికి సమీపంలోని మెరే ఫ్రిగోరిస్‌ వద్ద కుచించుకుపోయినట్లు చెప్పారు. ఎండు ద్రాక్ష మాదిరిగా చంద్రుడు కుచించుకుపోయాడని, ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

Shrinking Moon
Moonquakes

మరిన్ని వార్తలు