వైసీపీ నేతలతో మందేసి చిందేసిన ఎమ్మార్వోకు షాక్

Submitted on 20 November 2019
show cause notice for bhamini mro narasimhamurthy

వైసీపీ నేతలతో కలిసి మందేసి, చిందేసిన శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వో నరసింహమూర్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ నివాస్ ఆదేశాలతో ఎమ్మార్వోకు పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 

అసలేం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. పాలకొండ నియోజకవర్గానికి చెందిన స్థానిక వైసీపీ నేతలు భామిని మండలం నేరడి బ్యారేజ్ దగ్గర ఓ తోటలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం(నవంబర్ 17,2019) వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఎమ్మార్వో నరసింహమూర్తితో పాటు ఎమ్మార్వో కార్యాలయ సిబ్బందిని ఆహ్వానించారు. అధికారులు, ఉద్యోగులు వెళ్లి ఎంజాయ్ చేశారు. వైసీపీ నేతలతో కలిసి తిన్నారు, తాగారు. ఆ తర్వాత వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన పాటలకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. ఎమ్మార్వో నరసింహమూర్తి సైతం చిందులేశారు.

కాగా.. ఎమ్మార్వో, వైసీపీ నేతల పార్టీ వీడియోను ఎవరో సోషల్ మీడియతో పాటు వాట్సాప్‌లో షేర్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. వీడియో ఉన్నతాధికారుల వరకు చేరింది. దీంతో వారు సీరియస్‌గా స్పందించారు. తన స్థాయి మరిచి వ్యవహరించిన సదరు ఎమ్మార్వోకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వివరణ కోరారు. అంతేకాదు ఎమ్మార్వోపై శాఖాపరమైన విచారణ కూడా జరిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Srikakulam
bhamini mro
narasimhamurthy
palakonda rdo
Dance
vanabhojanam
Viral Video

మరిన్ని వార్తలు