బాబోయ్ ఇదేం వైవిధ్యం : కత్తులు, పాములతో బాడీ మసాజ్

Submitted on 22 March 2019
Shocking Video: Two Knives to 50kgs snakes Therapy massages go viral online

మసాజ్.. ఫేషియల్ మసాజ్.. మజిల్ మసాజ్.. బాడీ మసాజ్.. థాయ్ మసాజ్.. ఇలా ఎన్నో మసాజ్ లు విని ఉంటారు. చూసి ఉంటారు.. చేయించుకుని ఉంటారు.. ప్రస్తుత రోజుల్లో ఫేషియల్, మసాజ్ ల్లో కొత్త కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుందని, బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుందని మసాజ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తుంటారు. మసాజ్ చేయించుకుంటూ హాయిగా రిలాక్స్ అవుతుంటారు. మసాజ్ సెంటర్లకు వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త టెక్నిక్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంటారు.
Read Also : బీ అలర్ట్ : గూగుల్ ప్లస్, ఇన్‌బాక్స్‌ బై జీమెయిల్ మూసివేత

కస్టమర్ల రక్తంతో మసాజ్ :
మసాజ్ ల్లో ఎన్నో రకాల మసాజ్ లు ఉన్నాయో తెలుసా? వాంపైర్ ఫేషియల్.. అంటే.. కస్టమర్ల రక్తంతోనే వారి ముఖంపై ఫేషియల్ చేయడం.. గోల్డ్ మసాజ్.. అంటే.. 24క్యారెట్ల గోల్డ్ కస్టమర్ల శరీరంపై పెట్టి మసాజ్ చేయడం.. కేవియర్ ఫేషియల్ ఎంతో ఫేమస్.. ఉప్పు చేపతో ఫేషియల్ చేస్తారు.. ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయాయి. అందరూ చేయించుకుంటున్నారు. 

ఇటీవల కొత్త మసాజ్ టెక్నిక్స్ చైనాలో ట్రెండింగ్ అవుతున్నాయి. రిలాక్స్ అయ్యేందుకు ఈ సరికొత్త టెక్నిక్స్ చైనావాళ్లు ఫౌలో అవుతున్నారు. ఇప్పటివరకూ మీరు విన్న మసాజ్ లకు పూర్తిగా డిఫరెంట్. రెండే రెండు మసాజ్ టెక్నిక్స్ .. చైనా యువత అంతా ఈ మసాజ్ లు చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. ఇదే ట్రెండింగ్ గా మారిపోయింది.

అవేంటో తెలుసా? ఒకటి నైఫ్ మసాజ్.. రెండోది.. స్నేక్ మసాజ్.. షాక్ అయ్యారా? అమ్మో కత్తులు.. పాముతోనా అనుకుంటున్నారా? మీరు నమ్మిన నమ్మకపోయినా.. అవును. ఇది నిజం. అక్కడ ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒక టేబుల్ పై మసాజ్ చేయించుకునే వ్యక్తిని పడుకోబెడతారు.. మసాజ్ చేసే నిర్వాహాకులు.. మెల్లగా రెండు పదునైనా కత్తులు తీసుకొస్తారు..

పదునైన కత్తులతో మసాజ్ :
చూడాటానికి ఆ కత్తులు చుర కత్తుల్లా ఉంటాయి.. మాంసం నరికే కత్తులా కనిపిస్తాయి. మసాజ్ చేయడానికి ముందు.. రెండు కత్తులను బాగా సానబెడతారు. ఆ తర్వాత మసాజ్ థెరపీ స్టార్ట్ అవుతుంది. పడుకున్న వ్యక్తిపై ఒక్కమందమైన దుప్పట్టా కప్పుతారు. ముఖం పై నుంచి కాళ్ల వరకు కప్పేస్తారు. రెండు కత్తులను తలో ఒకటి తీసుకుని మాంసం ముక్కలు నరికినట్టు తలభాగం నుంచి కాళ్ల వరకు కొడుతుంటారు. అంతేకాదు.. మసాజ్ కు ముందు రెండు కత్తులకు ఆయిల్ అప్లయి చేసి మసాజ్ చేస్తుంటారు. సాధారణ కత్తులు కాదు ఇవి.. నైఫ్ థెరపీ కోసం స్పెషల్ గా రెండు కత్తులను డిజైన్ చేశారట. చూస్తుంటేనే వణుకుపుట్టేస్తుంది కదా.. 

భారీ కొండచిలువతో బాడీ మసాజ్
మరొక వెరైటీ మసాజ్ థెరపీ చూడండి.. అదే.. స్నేక్ థెరపీ.. పాముతోనా.. వామ్మో.. షాకయ్యారా? అదేలా అనుకుంటున్నారా? ఇదిగో చూడండి.. స్నేక్ థెరపీకి వాడే పాము పైథాన్.. 50కేజీల కోల్డ్ బ్లడ్ ఫైథాన్.. వణుకుపుట్టించే కొండచిలువతో ఒళ్లంతా పాకిస్తారు. ఈ కొండచిలువ రక్తం చాలా చల్లగా ఉంటుంది. పైథాన్ తో మసాజ్ థెరపీ చేయించుకుంటే వారి బాడీ ఫుల్ రిలాక్స్ అవుతుందట. ఏం... స్నేక్ థెరపీనో.. ఏమోగానీ.. మసాజ్ చేయించుకునేందుకు వచ్చినవారంతా భారీ కొండచిలువను చూసి హడలిపోతున్నారు. ఈ పైథాన్ ను ఓ జూ నుంచి తీసుకొచ్చి మసాజ్ థెరపీ చేస్తున్నారు. స్నేక్ థెరపీ, నైఫ్ థెరపీ ఎలా చేస్తారో ఈ కింది వీడియో చూడండి.. 

Read Also : మిస్టరీ : బీచ్‌లో నరికిన మనిషి కాళ్లు కొట్టుకొస్తున్నాయ్

Knives massage
Snake massage
China new massage tips
Massage therapy

మరిన్ని వార్తలు