ప్రభుత్వ టీచర్లకు షాక్ : 160మందికి షోకాజ్ నోటీసులు

Submitted on 16 April 2019
Shock For Government Teachers

రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ టీచర్లకు షాక్ ఇచ్చింది. ఏకంగా 160 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కు హాజరుకాకపోవడంతో విద్యాశాఖ సీరియస్ అయ్యింది. టీచర్లకు నోటీసులు ఇచ్చింది. 160మందికి ఒకేసారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి అని టీచర్లు అంటున్నారు.

ఏప్రిల్ 15వ తేదీ నుంచి 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇంగ్లీష్ టీచర్లు మాత్రం వాల్యుయేషన్ కి రాలేదు. దీన్ని సీరియస్ గా తీసుకున్న విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది. స్పాట్ వాల్యుయేషన్ కు ఎందుకు హాజరుకాలేదో 24 గంటల్లో వివరణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
Read Also : మరలా బాబే సీఎం : YCP అరాచకాన్ని అణిచివేస్తాం - బుద్ధా

ఒకేసారి 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్, స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ మొదలైంది. ఎన్నికల విధుల్లో ఉన్న టీచర్లకు వాల్యుయేషన్ నుంచి విద్యాశాఖ మినహాయింపు ఇచ్చింది. ఎన్నికల విధుల్లో లేని వారు కూడా వాల్యుయేషన్ కు హాజరుకాలేదు. దీంతో డీఈవో సీరియస్ అయ్యారు. ఏప్రిల్ 27వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది.

వాల్యుయేషన్ ముగిశాక వారం రోజుల తర్వాత రిజల్ట్స్ ప్రకటిస్తారు. టెన్త్ ఫలితాలు విద్యార్థుల ఫ్యూచర్ కి చాలా ముఖ్యం. దీంతో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కి విద్యాశాఖ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అలాంటి విషయంలో టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కోపం తెప్పించింది. 
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

government teachers
Shock
show cause notice
Ranga Reddy
tenth class
spot valuation
english teacher


మరిన్ని వార్తలు