ఏపీ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ షాక్ : అమరావతికి రూ.2,100 కోట్ల రుణ సాయం నిలిపివేత

Submitted on 18 July 2019
Shock to Ap government

వైసీపీ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్‌ షాకిచ్చింది. అమరావతి డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు నుంచి వరల్డ్‌ బ్యాంక్‌ తప్పుకుంది. రాజధాని డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు అందిస్తామన్న రుణ సాయాన్ని నిలిపివేసింది. గతంలో రూ.2వేల 100 కోట్లు అందిస్తామంటూ ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్‌.. ఇప్పుడు వెనకడుగు వేసింది. ప్రపంచ బ్యాంక్ యూటర్న్ తీసుకోవడానికి.. సీఎం జగన్‌ వైఖరే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది.
 
ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. కాగా దీనికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం రాలేదని సీఆర్డీఏ అధికారులు అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు సీఎం అయిన తర్వాత గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రజల నుంచి 34 వేల ఎకరాల భూములను సేకరించింది. భూసమీకరణపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ముందుగానే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూసేకరణ చేపట్టారని చంద్రబాబు మీద విమర్శలు వెల్లువెత్తాయి. 

వీటికి తోడు రాజధాని భూములపై వరల్డ్ బ్యాంక్ కి పెద్దఎత్తున రైతుల పేరుతో ఈ-మెయిల్స్ కూడా వెళ్లాయి. ఈ మెయిల్స్ వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ అప్పట్లో ప్రపంచ బ్యాంకుకి తెలిపింది. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి వచ్చి అంతా గమనించి క్లియరెన్స్ ఇచ్చారు.  నిన్నటి వరకు ప్రాజెక్టు పైప్ లైన్ లో ఉన్నట్లు స్టేటస్ లో ఉండగా ....తాజాగా డ్రాప్ అయినట్లు చూపిస్తోంది.

మరిన్ని వార్తలు