శివరాజ్ సింగ్ చౌహాన్ తండ్రి కన్నుమూత

Submitted on 25 May 2019
Shivraj Singh Chouhan's father passes away

మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తండ్రి ప్రేమ్ సింగ్(80) కన్నుమూశారు.శనివారం(మే-25,2019)మధ్యాహ్యాం ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో ప్రేమ్ సింగ్ తుదిశ్వాస విడిచారని బీజేపీ ప్రతినిధి తెలిపారు.అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం ఆయన లీలావతి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న చౌహాన్ భోపాల్ నుంచి ముంబైకి బయల్దేరారని ఆయన తెలిపారు. ఆదివారం(మే-26,2019)మధ్యప్రదేశ్ లోని షియోర్ జిల్లాల్లోని వాళ్ల పూర్వీకుల జైత్ గ్రామంలో ప్రేమ్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రేమ్ సింగ్ మృతి పట్ల మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్,మాజీ సీఎం కైలాష్ జోషి,బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభాత్ జా,కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జ్యోతిరాధిత్య సింధియా పలువురు తమ సంతాపం తెలిపారు.శివరాజ్ సింగ్ తండ్రి మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డానని కేంద్రమంత్రి సురేష్ ప్రభు అన్నారు.శివరాజ్ సింగ్,వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ప్రేమ్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించినట్లు సురేష్ ప్రభు ట్వీట్ ద్వారా తెలిపారు.

ప్రేమ్ సింగ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిపి నలుగురు కుమారులు,ఓ కుమార్తె ఉన్నారు. మధ్యప్రదేశ్ కు మూడు సార్లు సీఎంగా శివరాజ్ సింగ్ పని చేసిన విషయం తెలిసిందే.ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 సీట్లకు గాను 28 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంలో శివరాజ్ సింగ్ చౌహాన్ దే కీలకపాత్ర.

SIVARAJ SINGH CHOUHAN
father
PREM SINGH
PASSES AWA
Delhi

మరిన్ని వార్తలు