బీజేపీతో పొత్తు కోసమేనా : కాషాయంపై రాజ్ ముద్రతో MNS కొత్త జెండా

Submitted on 23 January 2020
Shivaji's Raj Mudra & Total Saffron: On Balasaheb's Birthday, Raj Thackeray Unveils MNS's New Flag

బీజేపీతో వేభేధించి కాంగ్రెస్,ఎన్సీపీ వంటి సెక్యులర్ పార్టీలతో శివసేన చేతులు కలిపి  మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన ఖాళీ చేసిన "హిందుత్వ" స్పేస్ ను క్లెయిమ్ చేసుకొని బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ తన జెండా మార్చింది. పూర్తిగా కాషాయ రంగు నేపథ్యంలో నలుపు రంగు అష్టభుజిపై పసుపు రంగు అక్షరాలతో ఉన్న రాజముద్రతో ఈ జెండా కనిపిస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అద్భుతమైన పాలనను ప్రేరేపించే విధంగా ఈ జెండా ఉంది. ఛత్రపతి శివాజీ పరిపాలన సమయంలో ఇలాంటి రాజముద్రను వాడేవారు. అంతకు ముందు ఎంఎన్ఎస్ జెండాలో కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు ఉండేవి.
 
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే గురువారం తన పార్టీ నూతన జెండాను ఆవిష్కరించారు. వీర్ సావర్కర్, అంబేద్కర్, ప్రబోధాంకర్ థాకరే, ఛత్రపతి శివాజీల చిత్ర పటాలకు రాజ్ థాకరే పూల మాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మెగా ర్యాలీని ప్రారంభించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జయంతిని ఆ పార్టీ కార్యకర్తలు గురువారం జరుపుకున్నారు. రాజ్ థాకరేకు బాల్ థాకరే పెదనాన్న విషయం తెలిసిందే. రాజ్‌ థాకరేతో ఇటీవల బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు. దీంతో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చాలా మంది భావించారు. ఒకప్పుడు విరోధులుగా ఉన్న ఈ ఇద్దరూ సమావేశమై ఏం చర్చించారన్నది ఆశక్తిగా మారింది. 
 
గతేడాది అక్టోబర్ లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షాపై ఎమ్ఎన్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చే స్థాయిలో కాకున్నా కనీసం ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉండేలా ప్రజలు ఆశీర్వాదించాలని ఎన్నికల సమయంలో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ప్రజలను అభ్యర్థించాడు. అయితే కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే ఎన్ఎమ్ఎస్ గెల్చుకోగలిగింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు,ఉనికిపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అంతకుముందు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎమ్ఎన్ఎస్ చతికిలబడిపోయిన విషయం తెలిసిందే. ఇలా పార్టీ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2009 నాటి నుంచి పెద్దగా ప్రభావం చూపలేకపోతూ వచ్చింది. ఈ సమయంలో పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన వ్యూహాలు మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగమే బీజేపీతో చర్చలు,జెండా రంగు మార్చడం.

Raj Thackeray
MNS
NEW FLAG
Party
BJP
alliance
UNVEILS
saffron

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు