దిశ నిందితుల మృతదేహాలు తరలించండి : హైకోర్టులో పిటిషన్

Submitted on 7 December 2019
shift disha accused dead bodies

ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్ నగర్ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. అలాగే మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. 

ప్రస్తుతం నలుగురి శవాలు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచే వసతులు లేవని పిటిషన్ లో పోలీసులు తెలిపారు. ఇప్పటికే మృతదేహాలు డీకంపోస్ అయ్యాయని వెల్లడించారు. మృతదేహాలను అప్పగించాలని కుటుంబసభ్యులు కూడా కోరుతున్న విషయాన్ని పిటిషన్ లో తెలిపారు పోలీసులు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై తమకు సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేంత వరకు మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించొద్దని ఎన్ హెచ్ఆర్సీ కోరింది. ఎన్‌హెచ్ ఆర్సీ ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ రూమ్‌లో భద్రపరిచారు. మరోవైపు ఎన్ కౌంటర్ కు సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. అంతవరకు (డిసెంబర్ 9, 2019) అంత్యక్రియలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశించింది. అయితే సరైన వసతులు లేవని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని.. దీంతో వెంటనే మృతదేహాలను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో మహబూబ్ నగర్ పోలీసులు పిటిషన్ వేశారు.

SHIFT
disha
ACCUSE
dead bodies
highcourt
Petition
mahaboobnagar police
de compose
gandhi hospital

మరిన్ని వార్తలు