ఐపీఎల్ మ్యాచ్ జరిగి ఉంటే : ఉప్పల్ స్టేడియంలో తప్పిన ప్రమాదం

Submitted on 23 April 2019
Shed collapse in uppal stadium

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సౌత్ పెవిలియన్‌ బైలాక్‌లోని షెడ్డు, భారీ ఎల్‌ఈడీ లైట్ కుప్పకూలాయి. పెవిలియన్‌లో 80 శాతం దెబ్బతిన్నట్టు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పిందన్నారు. నగరంలో సోమవారం (ఏప్రిల్ 22,2019) సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు వణుకు పుట్టించాయి. టవర్లు, హోర్డింగ్ లు, భారీ వృక్ష్యాలు కూలాయి. ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ వేదికగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో జనాలు స్టేడియంకి వస్తున్నారు. సోమవారం ఎలాంటి మ్యాచ్ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లేదంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు భయపడ్డారు.

గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు ఎన్టీఆర్ స్టేడియంలోని ఎగ్జిబిషన్ షెడ్, ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలాయి. ఫ్లడ్ లైట్ కూలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 4 కార్లు ధ్వంసమయ్యాయి. చాంద్రాయణగుట్టలో ఓ షెడ్డు కూలి బాలుడు మృతి చెందాడు. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Uppal Stadium
shed
collapse
south pavilion
Rains
Strong winds

మరిన్ని వార్తలు