షూటింగ్ పూర్తి చేసుకున్న సెవెన్

Submitted on 20 April 2019
Seven Movie Shoot Completed-10TV

హవీష్, రెహమాన్, నందితా శ్వేత, రెజీనా, అతిథి ఆర్య, అనీషా అంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న సినిమా, సెవెన్.. రమేష్ వర్మ స్టోరీ, స్ర్కీన్‌ప్లే, నిర్మాత కాగా, నిజార్ షఫీ ఫోటోగ్రఫీతోపాటు, డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌కి మంచి స్పందన వస్తుంది. రీసెంట్‌గా సెవెన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
Also Read : జెర్సీ - ఫస్ట్ డే కలెక్షన్స్

ఆరుగురు అమ్మాయిలు, ఆరు ప్రేమ కథలు.. ప్రతీ ప్రేమ కథలోనూ ఒక్కడే అబ్బాయి.. అదెలా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.. అంటున్నాడు దర్శకుడు.. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం.. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉండడమే కాక, ప్రతీ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.. ప్రతీ ట్విస్ట్ వెనుక కథలో భాగంగానే ఎమోషనల్ లవ్‌స్టోరీ ఉంటుంది.. మే లో సినిమా రిలీజ్ చేస్తాం.. అని డైరెక్టర్ కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు.

ఏడిద శ్రీరామ్, విద్యుల్లేఖ రామన్, ధనరాజ్, సత్య, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : చైతన్ భరద్వాజ్, కెమెరా : సతీష్, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, డైలాగ్స్ : మహర్షి, లిరిక్స్ : శ్రీమణి, పులగం చిన్నారాయణ, ఫైట్స్ : వెంకట్ మహేష్, ఆర్ట్ : గాంధీ

వాచ్ సెవెన్ మూవీ టీజర్...
  

Havish
Regina Cassandra
Nandita Swetha
Chaitan Bharadwaj
Ramesh Varma
Nizar Shafi

మరిన్ని వార్తలు