ఆగిన మెట్రో సర్వీసులు...ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లారు

Submitted on 21 May 2019
Services On Delhi Metro's Gurgaon Route Restored After Snag Hit Thousands

ఢిల్లీ,గుర్గామ్ లో ఇవాళ(మే-21,2019) భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.సాంకేతిక సమస్యల కారణంగా ఢిల్లీ మెట్రో ఎల్లో లైన్ కొన్ని గంటలపాటు ఆగిపోవడంతో ఢిల్లీ,గుర్గామ్ ప్రజలు పెద్ద ఎత్తున వాహనాలతో రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.గంటలపాటు వాహనాలు ముందుకు కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఢిల్లీ మెట్రోలో ఎల్లో లైన్ ఎప్పుడూ బిజీగా ఉంటుందన్న విషయం తెలిసిందే.ట్రాఫిక్ జామ్ పై  సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి.

ఢిల్లీ మెట్రోలో పవర్ ప్రాబ్లం వచ్చిందని,ఎల్లో లైన్ లో సర్వీసులు ఆగిపోయాయని,మెట్రో ట్రాక్ లపై నడుచుకుని వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారంటూ పలువురు మెట్రో ట్రాక్ లపై నడుచుకుంటూ వెళ్తున్న దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టో్ చేశారు.ఏఎఫ్ సీ గేట్స్ కూడా పనిచేయలేదని వారు తెలిపారు.మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో భారీగా రోడ్లపై చేరిన ప్రజల ఫొటోలను,వీడియోలు పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఢిల్లీ సీఎం కూడా దీనిపై స్పందించారు.ఢిల్లీ మెట్రో నుంచి డీటెయిల్డ్ రిపోర్ట్ కోరాలని రవాణాశాఖ మంత్రి కైలాష్ గెహ్లోత్ ను ఆదేశించినట్లు ఆయన ట్వీట్ చేశారు.అయితే మధ్యాహానానికల్లా మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభమైనట్లు ఢిల్లీ మెట్రో ట్వీట్ చేసింది.ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.

Delhi
Metro
resume
technical problem
Services
yellow line
stopped
gurugaon
Traffic Jam
walk
tracks

మరిన్ని వార్తలు